Begin typing your search above and press return to search.

పౌరసత్వ బిల్లుతో ఏం జరగనుంది? ఎలాంటి అవకాశం ఇవ్వనుంది?

By:  Tupaki Desk   |   10 Dec 2019 5:59 AM GMT
పౌరసత్వ బిల్లుతో ఏం జరగనుంది? ఎలాంటి అవకాశం ఇవ్వనుంది?
X
కొన్ని దశాబ్దాల క్రితం కమ్యునిస్టుల మీద ఒక జోక్ ను తరచూ ప్రస్తావించేవారు. చైనాకు జలుబు చేస్తే.. దేశంలోని కమ్యునిస్టులకు తుమ్ములు వచ్చేవని.. రష్యాకు చలిపుడితే.. భారత్ లోని కామ్రేడ్స్ వణికే వారంటూ సరదాగా చెప్పేవారు. కానీ.. అదెంత నిజమన్నది చరిత్రను చూస్తే అర్థమవుతుంది. తాము నమ్మిన సిద్ధాంతాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ.. తమను తాము విశ్వపౌరులుగా చెప్పుకోవటం వీరికి మాత్రమే సాధ్యమవుతుంది.

తాము మాత్రం ఒక పక్కకు వంగుతాం కానీ.. ఇంకెవరూ వంగినా మాత్రం ఒప్పుకోమనే పస లేని వాదనను వీరు వినిపిస్తుంటారు. తమను తాము లౌకికవాదులుగా గొప్పలు చెప్పుకునే వీరు.. తమను వ్యతిరేకించినోళ్లను.. తమ వాదనను ఒప్పుకోని వారి మీద మతతత్వవాదులుగా.. అతివాదులుగా ప్రచారం చేస్తుంటారు. ఈ వర్గానికి చెందినోళ్లు మీడియాలో దశాబ్దాల తరబడి పాతుకుపోవటంతో తమ భావజాలాన్ని ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా ప్రజల్లో ఇంజెక్టు చేస్తూ.. కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారని చెప్పాలి.

సమాచార విప్లవం ఇంత పెరిగిన తర్వాత.. సమస్త సమాచారం అందరి చేతుల్లో వచ్చిన తర్వాత కూడా వాస్తవాల్ని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవటంలోనూ తమకున్న శక్తియుక్తుల్ని తాజా పౌరసత్వ బిల్లు విషయంలోనూ ప్రదర్శించారని చెప్పాలి. అసలు వివాదమే లేని బిల్లును వివాదాస్పదమన్న తోకను తగిలించటంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి.

ఇదెక్కడి పిడివాదనండి బాబు. ఇప్పటిదాకా వినిపించిన వాదనకు భిన్నంగా భలే సిత్రంగా చెబుతున్నారే? అనుకుంటున్నారా? అసలు విషయాలు తెలిస్తే మేం చెప్పేది నిజమెంతో మీకు ఇట్టే అర్థమైపోతుంది. విపరీతమైన చర్చ అనంతరం అత్యధిక మెజార్టీతో నెగ్గిన పౌరసత్వ బిల్లు ఎవరికి ఎలాంటి అవకాశం కల్పిస్తుందన్న విషయంలోకి వెళితే..

% పాకిస్థాన్.. అఫ్గానిస్థాన్.. బంగ్లాదేశ్ లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొనే ముస్లిమేతరులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని ఆమోదిస్తారు.

% ఈ మూడు దేశాల్లోని హిందువులు.. క్రైస్తవులు.. పార్శీలు.. జైనులు.. బౌద్ధులు.. సిక్కులు ఈ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

% ఇలాంటి వారికి సరైన ట్రావెల్ డాక్యుమెంట్లు.. ఇతర పత్రాలు లేకున్నా వారు2014 డిసెంబరు 31 లేదా అంతకు ముందే భారత్ కు వచ్చి ఉండాలి.

బిల్లుపై ఉన్న సందేహాలు.. సమాధానాలు

ముస్లింలకు ఎందుకు అవకాశం కల్పించట్లేదు?
ముస్లిం దేశాల్లో మెజార్టీలు ముస్లింలే. వారికి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాంటప్పుడు వారు వారి దేశంలోనే ఎందుకు ఉండకుండా భారత్ కు రావాలనుకోవటం వెనుక కారణం ఏమిటి?

ముస్లిమేతరులకు ఎందుకు అవకాశం ఇస్తున్నట్లు? మూడు దేశాలకే ఎందుకు?
వారు భారత్‌కు కాక మరెక్కడికి పోతారు? ఈ మూడు దేశాలే ఎందుకంటే... ఇవి మనకు అతి సమీపంగా, దాదాపు కలిసిపోయినట్లుగా ఉన్న సరిహద్దులు గలవి, అంతకుమించి ఇవి మూడూ ఇస్లామిక్‌ దేశాలు. అక్కడ ముస్లింలకూ ఎటూ రక్షణ ఉంటుంది. మిగిలిన మతస్థులు ద్వితీయశ్రేణి పౌరులు. అందుకే హిందూ, క్రైస్తవ, బౌద్ధ, జైన, పార్శీ, సిక్కు మతస్థులకు పౌరసత్వం కల్పిస్తున్నారు.

పౌరసత్వ బిల్లును చట్టంగా చేసి దేశాన్ని మతపరంగా చీలుస్తున్నారా?
చరిత్రను చూస్తే.. ఈ ప్రశ్నకు సమాధానం ఇట్టే అర్థమవుతుంది. దేశాన్ని మతపరంగా విభజించినది కాంగ్రెస్‌ పార్టీయే! నాడు దేశ విభజన జరిగి ఉండకపోతే నేడీ బిల్లు తేవాల్సిన అవసరమే ఉండేది కాదు కదా? పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొనే ముస్లిమేతరులు వేలల్లో ఉన్నారు. వారికి న్యాయం జరగాలి కదా? అలాంటి వారికి భారత్ తప్పించి మరే దేశంలోనూ అవకాశం లేదు. అయినా.. అఫ్ఘాన్ ఒక్కటి మినహాయిస్తే.. పాక్.. బంగ్లాలు 70ఏళ్ల క్రితం మన దేశంలోనిదే కదా?