Begin typing your search above and press return to search.

వచ్చే ఎన్నికల్లో జగన్ ఏమి చేస్తాడో ?

By:  Tupaki Desk   |   3 Dec 2021 4:18 AM GMT
వచ్చే ఎన్నికల్లో జగన్ ఏమి చేస్తాడో ?
X
రాబోయే షెడ్యూల్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమయ్యేట్లుంది. 2024లో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమిటనే విషయం ఆసక్తిగా మారింది.

ఎందుకంటే ప్రస్తుతం జాతీయ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మొన్నటివరకు జాతీయ రాజకీయాల్లో ఎన్డీయే-యూపీఏ మాత్రమే ఉండవే. కానీ తాజాగా పశ్చిమబెంగాల్ ఫైర్ బ్రాండ్ సీఎం మమతా బెనర్జీ చేసిన తాజా వ్యాఖ్యలు దేశంలో సచలనంగా మారింది.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ తర్వాత మమత మీడియాతో మాట్లాడుతు అసలు యూపీఏ ఉందా అంటు చేసిన కామెంట్ చాలా వైరలుగా మారింది. ఆమె ఉద్దేశ్యంలో ఎన్డీయేని ఎదుర్కోవటంలో యూపీఏ నూరుశాతం ఫెయిలైందని అర్ధమవుతోంది. అసలు యూపీయే ఇంకా ఉందా ? అన్న మమత కామెంటుతోనే ఆమె ఆలోచన ఏమిటో అర్ధమైపోతోంది.

పైగా 2024 ఎన్నికలకు నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ కూటమిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మమత బలంగా నమ్ముతున్నారు.

జాతీయ రాజకీయాల్లో మమత ప్రయత్నాలకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నిజమే అయితే మరి జగన్ వైఖరి ఎలా ఉండబోతోందన్నది చాలా కీలకమవుతుంది.

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ జగన్ చేరుతారని అనుకునేందుకు లేదు. అలాగని ఎన్డీయేతో చేతులు కలపటానికి కూడా ఇష్టపడటంలేదు. ఏదో ఒక కూటమికి మద్దతు ఇవ్వాల్సిన తప్పని పరిస్ధితులు వస్తే అప్పుడు జగన్ ఏమి చేస్తారన్నది చాలా ఆసక్తిగా మారింది.

నిజానికి ప్రతిపక్షాల ఓట్లు ఎంతగా చీలిపోతే ఎన్డీయే అంతగా లాభపడుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే వివిధ రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రధానంగా బీజేపీపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం అందరు చూస్తున్నదే. ఇదే నిజమైతే నాన్ ఎన్డీయే కూటమి బలోపేతమవుతుందని అందరు అంచనా వేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ కూటమి ఏర్పాటు అవ్వాల్సిన అవసరం ఉందని మమత చెబుతున్నారు.

దీంతో మమత చెబుతున్న కూటమివైపు జగన్ ఉంటారా ? లేకపోతే ఏ కూటమిలోను చేరకుండా తటస్తంగా ఉంటారా అన్నది తేలాలి. ఇక్కడ కూడా జగన్ కు ఒక మంచి జరిగే అవకాశం ఉంది. రేపటి ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఒకవేళ జగన్ మద్దతే అవసరమైతే అప్పుడు ఏపీ ప్రయోజనాల డిమాండ్లను ముందు పెట్టవచ్చు.

జగన్ డిమాండ్లు తీర్చటానికి ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళకే మద్దతుగా నిలబడతారని అనుకోవచ్చు. కాబట్టే 2024 ఎన్నికలు ఏపీకి చాలా కీలకమైందనే అనుకోవాలి.