రఘురామ ఎపిసోడ్ పై లోక్ సభ స్పీకర్ ఏం చెప్పారు

Fri Jun 18 2021 16:00:01 GMT+0530 (IST)

What the Lok Sabha Speaker said on the Raghurama

నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ క్రిష్టమరాజుకు సంబంధించి చోటు చేసుకున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైనా.. ఆయన ప్రభుత్వంపైనా అదే పనిగా విమర్శలు చేయటం.. కులాలు.. మతాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారన్న ఆరోపణలతో ఏపీ సీఐడీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి గుంటూరు జైలుకు తరలించే క్రమంలో ఆయన్ను విచారించటం.. ఆ సమయంలో తనపై భౌతిక దాడికి పాల్పడ్డారంటూ పలువురి పేర్లను ప్రస్తావించిన రఘురామ ఆరోపణలు సంచలనంగా మారాయి. తనకు బెయిల్ ఇప్పించాలంటూ సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని సంప్రదించారు. ఆధారాల్ని పరిశీలించిన వేళ.. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ.. కండిషన్లు విధించారు

ఆ వెంటనే సికిందరాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రి నుంచి ఢిల్లీకి ఆయన మెరుగైన వైద్యం పేరుతో వెళ్లిపోయారు. అప్పటి నుంచి కేంద్రమంత్రులు.. వీలైన ప్రతిసందర్భంలోనూ లోక్ సభ స్పీకర్ తో భేటీ అయ్యారు. తనకు ుజరిగిన అన్యాయం గురించి వివరిస్తూ.. తక్షణం చర్యలు చేపట్టాలని కోరారు.
ఇదిలా ఉంటే తాజాగా రఘురామ అరెస్టు.. అనంతరం చోటు చేసుకున్న పరినామాల నేపథ్యంలో ఎంపీ కుమారుడు రఘుతో పాటు.. టీడీపీ ఎంపీలు కనకమేడల.. రామ్మోహన్ నాయుడు కూడా స్పీకర్ కు కంప్లైంట్ చేశారు. దీనిపై తాజాగా లోక్ సభ స్పీకర్ స్పందించారు. రఘురామ ఇచ్చిన హౌస్ మోషన్ పై ఏపీ ముఖ్యమంత్రి... రాష్ట్ర డీజీపీ.. సీబీఐ ఏడీజీ సీఐడీ ఎస్పీలపై ఆయన సభాహక్కుల వినతిని ఇవ్వటం.. 15రోజుల్లో వాటికి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను తనకు పంపాలని కేంద్ర హోం శాఖను ఆదేశించారు స్పీకర్ ఓం బిర్లా. మరేం జరుగుతుందో చూడాలి.