ఆ నటి ఎంపీ పరిస్థితి ఏం కానుంది?

Thu Jun 10 2021 11:00:01 GMT+0530 (IST)

What is the situation going to be like for that actress MP?

తెలుగుతోపాటు దక్షిణాదిన పలు సినిమాల్లో నటించిన నవనీత్ కౌర్ ఇప్పుడు మహారాష్ట్రలో ఓ రాజకీయ కుటుంబంలో కోడలు అయిపోయింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిన భర్త ప్రోత్సాహంతో ఏకంగా ఎంపీగా పోటీచేసి గెలిచింది. తెలుగులో ఆర్పీపట్నాయక్ హీరోగా వచ్చిన ‘శీను వాసంతి లక్ష్మీ’లో నవనీత్ కౌర్ హీరోయిన్. ఇలాంటి ముద్దుగుమ్మ ఇప్పుడు తన ఎంపీ సీటును కోల్పోయే ప్రమాదంలో పడ్డారు.నవనీత్ కౌర్ తప్పుడు కుల ధ్రువీకరణతో ఎంపీగా గెలిచిందని బాంబే హైకోర్టు ధ్రువీకరించింది. తను ఎస్సీనంటూ నవనీత్ కౌర్ సమర్పించిన కులధ్రువీకరణ పత్రం నకిలీది అని కోర్టు తేల్చింది. ఆ సర్టిఫికెట్ ను రద్దు చేస్తూ తాజాగా తీర్పునిచ్చింది.

తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించిన రాజకీయ నేతల ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వంటి నేతల పదవులు  ఊడిపోయే అవకాశాలే ఎక్కువ. ఈ నేపథ్యంలోనే నవనీత్ కౌర్ ఎంపీ పదవికి కూడా ఎసరు వచ్చింది.

తను చర్మకారుల కులానికి చెందిన దానినంటూ ఎస్సీ సర్టిఫికెట్ అమరావతి ఎంపీగా పోటీచేసి నవనీత్ గెలిచారు. అయితే ఆమె బర్త్ సర్టిఫికెట్ లో ఈ కులం వివరాలు లేవని తేలింది. దీంతో చర్మకారుల కుటుంబానికి చెందిన ఆమె కాదని తేలింది. క్యాస్ట్ సర్టిఫికెట్ ను రద్దు చేసింది.

ఇక తప్పుడు కులంతో గెలిచినట్టు నిర్ధారణ అయితే నవనీత్ కౌర్ పై లోక్ సభ స్పీకర్ వేటు వేసే ప్రమాదం ఉంది. అయితే దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని.. పోరాడుతానని.. వివరాలు సమర్పిస్తానని తెలిపింది. దీంతో ఈ కేసు మరింత జాప్యం అయ్యేలా ఉంది.