Begin typing your search above and press return to search.

టీడీపీ నేతల మౌనానికి కారణమేంటి?

By:  Tupaki Desk   |   21 April 2021 1:30 PM GMT
టీడీపీ నేతల మౌనానికి కారణమేంటి?
X
గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తెగ హల్ చల్ చేశారన్న అపవాదు ఉంది.. వైసీపీ నేతలు, ముఖ్యంగా జగన్ పై చిందులు తొక్కారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అధికారం మారింది. సీఎంగా జగన్ అయ్యాక.. ఎవరైతే టీడీపీ తరుఫున నిలబడ్డారో వారి అక్రమాలు వెలికి తీసి జగన్ సర్కార్ జైలుకు పంపుతోందన్న టాక్ టీడీపీలో సాగుతోంది.

ఇప్పటికే జగన్ పై ఒంటికాలిపై లేచిన మాజీ మంత్రి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ మందుల స్కాంలో అరెస్ట్ అయ్యి జైలుపాలయ్యారు. ఇక టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు కూడా కేసుల్లో అరెస్ట్ అయ్యారు.

ఇక పోనీ వైసీపీపై పోరాడితే పార్టీ పట్టించుకుంటుందా? అంటే అదీ లేకుండా పోతోందన్న ఆవేదన నేతల్లో ఉందట... నేతలు జైలుకు వెళితే కనీసం బెయిల్ ఇప్పించడం లేదని దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వాపోయినట్టు ప్రచారం సాగుతోంది. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు వైసీపీపై పోరాడితే కేసులు, జైలు తప్పితే లాభం లేదని తమ వ్యాపారాలు, వ్యాపకాలు చూసుకుంటూ సైలెంట్ అయిపోతున్నారట..

పోనీ టీడీపీకి భవిష్యత్ ఉంది.. కొట్లాడుదాం అనుకుంటే గడిచిన పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. దీంతో అనవసరంగా టీడీపీతో పెట్టుకొని కేసులు ఎదుర్కొనే బదులు కొద్దికాలం మౌనంగా ఉంటే బెటర్ అన్న ఆలోచనలో టీడీపీ నేతలంతా సైలెంట్ అవుతున్నారు. చంద్రబాబు, పార్టీపై అపనమ్మకంతో అందరూ తమ తమ వ్యాపారాలు, ఇతర వ్యవహారాల్లో బిజీ అయిపోతున్నట్టు తెలుస్తోంది.