Begin typing your search above and press return to search.

‘మ‌ట్టి కుస్తీ’ ప‌బ్లిక్ టాక్ ఏంటీ?.. ఎలా వుంది!

By:  Tupaki Desk   |   2 Dec 2022 3:03 PM GMT
‘మ‌ట్టి కుస్తీ’ ప‌బ్లిక్ టాక్ ఏంటీ?.. ఎలా వుంది!
X
త‌మిళంలో కొత్త త‌ర‌హా క‌థ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌న్ గా నిలుస్తున్నాడు యంగ్ హీరో విష్ణు విశాల్‌. రాక్ష‌స‌న్‌, అర‌ణ్య‌, ఎఫ్ ఐ ఆర్ వంటి సినిమాల‌తో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. త‌మిళంలో తాను న‌టించిన `రాక్ష‌స‌న్‌` తెలుగులో `రాక్ష‌సుడు`గా రిమేక్ అయిన ఇక్క‌డ కూడా విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. తెలుగులోనూ మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న విష్ణు విశాల్ అర‌ణ్య‌, ఎఫ్ ఐ ఆర్ సినిమాల‌తో తెలుగు మార్కెట్ పై గురి పెట్టాడు. తను న‌టించిన ప్ర‌తీ సినిమాని తెలుగులోనూ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటూ వ‌స్తున్నాడు.

తాజాగా విశాల్ విష్ణు న‌టించిన `గ‌ట్టా కుస్తీ` కూడా తెలుగులో `మ‌ట్టి కుస్తీ`గా ఈ శుక్ర‌వారం విడుద‌లైంది. ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీని చెల్ల అయ్య‌వు తెర‌కెక్కించాడు. మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరో విష్ణు విశాల్ తో క‌లిసి ఈ మూవీని నిర్మించాడు. దీంతో ఈ మూవీపై తెలుగులోనూ మంచి అంచ‌నాలు ఉర్ప‌డ్డాయి. దీనికి త‌గ్గ‌ట్టే టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా వుండటంతో ప్రేక్ష‌కుల్లోనూ ఈ మూవీపై ఆస‌క్తి పెరిగింది.

శుక్ర‌వారం విడుద‌లైన ఈ మూవీ ప‌బ్లిక్ టాక్ ఏంటీ?.. ఎలా వుంది. అన్న‌ది ఇప్ప‌డు చూద్దాం. వీరా (విష్ణు విశాల్‌) ఆంధ్రా ప్రాంతానికి చెందిన కుర్రాడు. ఎనిమిద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకున్న త‌ను త‌ల్లితండ్రుల్ని చిన్న‌త‌నంలోనే కోల్పోవ‌డంతో అన్నీ తానై మేన మామ (క‌రునాస్‌) పెంచుతాడు. వీరా ఏ ప‌నీ పాటా లేకుండా ఊళ్లో బ‌లాదూర్ గా తిరుగుతుంటాడు. చిన్న చిన్న గొడ‌వ‌ల‌కు వెళ్ల‌డం.. స్నేహితుల‌తో క‌లిసి క‌బ‌డ్డీ ఆడ‌టం అత‌ని దిన‌చ‌ర్య‌. అలాంటి త‌ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి త‌న కంటే త‌క్కువ చ‌దువుకొని వుండాల‌ని, త‌న‌కు పొడ‌వాటి జ‌డ వుండాల‌ని కండీష‌న్స్ పెడ‌తాడు.  

అలాంటి వ్య‌క్తికి మ‌గ‌రాయుడిలా బ‌రిలోకి దిగి కుస్తీ ప‌ట్టే కీర్తి (ఐశ్వ‌ర్య ల‌క్ష్మి) తో నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య వివాహం జ‌రుగుతుంది. బీఎస్సీ వ‌ర‌కు చ‌దువుకున్న కీర్తి ఇంట్లో వాళ్ల‌కు ఇష్టం లేక‌పోయినా రెజ్ల‌ర్ అవుతుంది. ఈ విష‌యం వీరాకు తెలిశాక ఏం జ‌రిగింది? .. వీరిద్ద‌రి క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది? .. ఇద్ద‌రు క‌లిసి వున్నారా?.. ఈ ఇద్ద‌రు క‌లిసి మ‌ట్టి కుస్తీలో ఎందుకు త‌ల‌ప‌డ్డారు? .. ఇద్ద‌రు మథ్య ఏర్ప‌డిన మ‌న‌స్ప‌ర్థలు ఎలా తొలిగిపోయాయ‌న్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

త‌న‌కంటే ఎక్కువ చ‌దివిన భార్య వ‌స్తే త‌న మాట విన‌ద‌ని ఈగోతో వుంటే యువ‌కుడికి రెజ్ల‌ర్ భార్య‌గా వ‌స్తే ఏం జ‌రిగింది?.. ఆ విష‌యం తెలిసి హీరో ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడ‌న్న‌ది పూర్తిగా వినోదాత్మ‌కంగా చెప్పారు. భార్య‌కు కూడా స‌మాన ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని చెప్పే సందేశం బాగుంది కానీ త‌న కోసం 15 రోజుల్లోనే మ‌ట్టి కుస్తీ నేర్చుకుని హీరో బ‌రిలోకి దిగ‌డం అంత‌గా పండ‌లేదు. స్క్రీన్ ప్లే విష‌యంలోనూ ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ్డాడు. ఓవ‌రాల్ గా చెప్పాలంటే అక్క‌డ‌క్క‌డ ఫ‌న్నీ కామెడీ త‌ప్ప సినిమాలో ఏమీ లేద‌ని అంటున్నారు. ఈ సినిమాకు ర‌వితేజ ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. అయితే త‌ను నిర్మాత‌గా విఫ‌ల‌మైనట్టేన‌ని `మ‌ట్టికుస్తీ` ఫలితం తేల్చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.