Begin typing your search above and press return to search.

ఇప్పుడు అధికారంలో ఉండగా చేయనిది.. రాబోయే అధికారంలో బీజేపీ చేస్తుందా?

By:  Tupaki Desk   |   5 March 2021 2:30 AM GMT
ఇప్పుడు అధికారంలో ఉండగా చేయనిది.. రాబోయే అధికారంలో బీజేపీ చేస్తుందా?
X
'ఉట్టికి ఎగురలేనమ్మా.. స్వర్గానికి నిచ్చెన వేస్తుందట.. వెనుకటికి ఒకావిడ..' అలా ఉంది బీజేపీ పరిస్థితి అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఎందుకంటే బీజేపీ ఇచ్చిన హామీ అలాంటిది మరీ.. ఆ హామీ చూసి ఇప్పుడు నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.

కేరళలో గెలుపు కోసం బీజేపీ కుప్పిగంతులు వేస్తోందన్న చర్చ అక్కడి రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఎందుకంటే అక్కడ అయితే కమ్యూనిస్టులు.. లేదంటే కాంగ్రెస్ వాదులకే అధికారం.. అందుకే ఇస్రో చైర్మన్ ను బీజేపీలో చేర్చుకొని కేరళ బీజేపీ సీఎంగా అభ్యర్థి ప్రకటించి బీజేపీ హల్ చల్ చేస్తోంది.

తాజాగా కేరళ ప్రజలకు ఓ వినూత్న హామీ ఇచ్చింది. అదేంటంటే.. రాబోయే కేరళ ఎన్నికల్లో గెలిచి బీజేపీ అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్ రూ.60కే దక్కుతుందని బీజేపీ తాజాగా ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ ను కూడా జీఎస్టీలోకి చేరువేస్తామని హామీ ఇచ్చేశాడు.

అయితే ఈ పెట్రోల్ ధరలను పెంచిందే బీజేపీ. రూ.100 దాటించిందే మోడీ సర్కార్. అలాంటి మోడీనే ఇప్పుడు అధికారంలో ఉండి చేయలేనని పనిని.. ఒక రాష్ట్రంలో అధికారం అప్పగిస్తే చేస్తామనడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అదేదో ఇప్పుడే దేశవ్యాప్తం గా చేయవచ్చు కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. లేకుంటే ఇదే ఫేక్ హామీగా మిగిలిపోతుందని కౌంటర్లు ఇస్తున్నారు.