Begin typing your search above and press return to search.

ఇంతకీ జిన్ పింగ్ కు ఏమైంది ?

By:  Tupaki Desk   |   26 Sep 2022 4:51 AM GMT
ఇంతకీ జిన్ పింగ్ కు ఏమైంది ?
X
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ విషయంలో అంతర్జాతీయంగా బాగా అయోమయం పెరిగిపోతోంది. జిన్ పింగ్ ను మిలిటరీ హౌస్ అరెస్టు చేసిందనే ప్రచారం ఆదివారమంతా విపరీతంగా జరిగింది. బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి శనివారం చేసిన ట్వీట్ దేశంలో బాగా వైరల్ అయ్యింది. ఇదే పద్ధతిలో కాస్త అటు ఇటుగా అంతర్జాతీయ మీడియా కూడా వార్తలు, కథనాలను అందించాయి. అయితే ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జిన్ పింగ్ హౌస్ అరెస్టు కాదంటు ప్రచారం మొదలైంది.

విదేశాల నుండి వచ్చిన జిన్ పింగ్ తనంతట తానుగా క్వారంటైన్ లోకి వెళ్ళారనే ప్రచారం మొదలైంది. చైనాలో జీరో కోవిడ్ పాలసీ అమలవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే విదేశాల నుండి ఎవరు వచ్చినా ముందుగా సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాల్సిందే. అలాగే ఇప్పుడు అధినేత కూడా తనంతట తానుగా సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్ళారనే ప్రచారం మొదలైంది. బీజింగ్ నగరం మొత్తాన్ని మిలిటరీ తన ఆధీనంలోకి తీసుకున్న విషయం కూడా ఆసక్తిగా మారింది.

వచ్చే నెలలలో రిపబ్లిక్ ఆఫ్ చైనా జరుపుకోబోతున్న జతీయ దినోత్సవంలో భాగంగానే ఆర్మీ కవాతు జరుగుతోందని చైనా సౌత్ పోస్టు మీడియా చెప్పింది. బీజింగ్ మీదుగా వెళ్ళాల్సిన వందలాది విమనాలను రద్దు చేశారనే ప్రచారం తప్పని తేలింది. ఒక్క విమానం కూడా రద్దుకాలేదని విమానాల షెడ్యూలింగ్ లేని సమయంలో శాటిలైట్ ఫొటోలు తీయటం వల్లే అందరిలో అయోమయం పెరిగిపోయిందంటున్నారు.

ఇక జిన్ పింగ్ కొద్దిరోజులు అదృశ్యం అవుతుండటం చాల మామూలే అని కూడా లోకల్ మీడియా చెబుతోంది. గతంలో కూడా మూడు సార్లు ఏదో వ్యక్తిగత అవసరాల కోసం కొద్దిరోజుల పాటు మాయమైపోయారట. ఇలాంటి ఉదాహరణలు చూసిన తర్వాత జిన్ పింగ్ ను మిలిటరీ అరెస్టు చేయలేదని, ఆయనే సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్ళారనే వాదనల్లో లాజిక్ కనిపిస్తోంది. కాకపోతే జిన్ పింగ్ అదృశ్యం కారణాల్లో ఏది నిజమో మాత్రం బయట ప్రపంచానికి అర్ధం కావటం లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.