Begin typing your search above and press return to search.

పార్ల‌మెంటులో అదే ర‌చ్చ‌.. బీఆర్ ఎస్ ఎంపీలు ఏం చేశారంటే!

By:  Tupaki Desk   |   6 Feb 2023 4:00 PM GMT
పార్ల‌మెంటులో అదే ర‌చ్చ‌.. బీఆర్ ఎస్ ఎంపీలు ఏం చేశారంటే!
X
దేశంలోనే ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌గా కేవ‌లం నాలుగేళ్ల‌లోనే ఆకాశ‌మంత ఎత్తు ఎదిగిన గౌతం అదానీ వ్య‌వ‌హా రం పార్ల‌మెంటును కుదిపేస్తోంది. రెండురోజుల విరామం త‌ర్వాత‌.. తాజాగా ప్రారంభ‌మైన‌ ఉభయ సభల్లో అదానీ సంస్థలపై హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ప‌దే ప‌దే స‌భ‌ల‌ను వాయిదా వేశారు. నిజానికి గత వారంలో రెండుసార్లు ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది.

ఇదిలావుంటే, తాజాగా అదానీ అంశంపై చర్చించాలని తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ఎంపీలు, త‌మిళ‌నాడు అధికార పార్టీ డీఎంకే పార్టీ ఎంపీలు ఉభయసభల్లో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇండియన్ వర్క్ నివేదిక ఆధారంగా సంయుక్త పార్లమెంటరీ సంఘం లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో దర్యాప్తు జరపాలని బీఆర్ ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు.

అయితే.. వాయిదా తీర్మానాన్ని ఉభ‌య స‌బ‌ల్లోనూ స్పీక‌ర్‌, చైర్మ‌న్‌లు తిర‌స్క‌రించారు. దీంతో ఈ అంశంపై త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ఏంట‌నే విష‌యంపై చ‌ర్చించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంట‌రీ నేత మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో విపక్షాలు భేటీ అయ్యాయి. ఉదయం నుంచి గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించాయి. తదుపరి కార్యాచరణను చర్చించి ఖరారు చేయనున్నాయి. ఈ అంశంపై బీఆర్ఎస్‌తో పాటు డీఎంకే పార్టీ కూడా ఉభయసభల్లో వాయిదా తీర్మానం ఇవ్వ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.