Begin typing your search above and press return to search.

కండోమ్ వాడకంపై తెలుగు మొగాళ్లు ఏమంటున్నారు..?

By:  Tupaki Desk   |   28 Jun 2022 9:30 AM GMT
కండోమ్ వాడకంపై తెలుగు మొగాళ్లు ఏమంటున్నారు..?
X
ఇంగ్లండ్ వెళ్తూ వెళ్తూ.. మాల్దీవుల్లో గడిపిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కొవిడ్ బారినపడ్డాడు. అయితే, అతడు కోలుకున్నాక ఈ విషయం బయటపడింది. ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడేశాడు కాబట్టి ఇప్పుడు సమస్యేమీ లేదనుకోండి. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐదు రోజుల్లో టెస్టు ప్రారంభం కానుంది అనగా.. కొవిడ్ కు గురయ్యాడు. ఇప్పుడు అతడు మ్యాచ్ ఆడేది అనుమానంగానే ఉంది. అసలు ఇంగ్లండ్ చేరాక మన క్రికెటర్లు చేసిన పనేంటి? ఖాళీ సమయాల్లో బయటకు వచ్చి షాపింగ్.. వారి వ్యక్తిగత స్వేచ్ఛను ఎవరూ ప్రశ్నించడం లేదు.

అయితే, బయటకు వచ్చినప్పుడు కొవిడ్ జాగ్రత్తలు పాటించకపోవడమే సమస్యగా మారింది. ఇంగ్లండ్ లాంటి చిన్న దేశంలో ప్రస్తుతం రోజుకు 10 వేల కేసులు వస్తున్నాయి. అలాంటిచోట కనీసం భౌతిక దూరం పాటించకున్నా ఫర్వాలేదు. మాస్క్ అయినా పెట్టుకోవాలి. అయితే, దానిని కూడా మన క్రికెటర్లు విస్మరిస్తున్నారు. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇటీవల బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన ఫోటోలు వీడియోలు నెట్టింట హల్ చల్ చేశాయి. వారు అభిమానులతో సెల్ఫీలు దిగుతున్నట్లు ఆ చిత్రాల్లో కన్పించింది.

ఇక ఇటీవల వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ సైతం కొంతమంది పిల్లలు వచ్చి ఆటోగ్రాఫ్, ఫోటోలు అడిగేసరికి తాను కూడా ఆటోగ్రాఫ్స్ ఇచ్చి వారి సమూహంతో పాటు ఫోటోలు దిగాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మండిపడింది. ఆటగాళ్లకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదని, విహారాలను హ్యాంగ్‌అవుట్‌లను పరిమితం చేసుకుని హోటల్లోనే బస చేయాలని స్పష్టం చేసింది.

'ఇంగ్లాండ్ పర్యటనలో కొంతమంది ఆటగాళ్లు బహిరంగంగా తిరుగుతున్నారు. అవసరం లేకున్నా పలు ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ అలవాటును మార్చుకోవాలని హెచ్చరించాం. కొంతమంది అభిమానులతో ఫొటోలు దిగడం కొవిడ్ వ్యాప్తికి కారణమవుతోంది. జాగ్రత్తగా ఉండాలని చెప్పాం. పదే పదే సూచించాం' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

మయాంక్ కు పిలుపు

శనివారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ లో రోహిత్ శర్మకు కరోనా నిర్ధారణ కావడంతో కౌంటీ జట్టు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగలేదు. ప్రస్తుతం అతడు క్వారంటైన్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌లో బయో బబుల్, ఐసోలేషన్ తదితర నిబంధనలు ఎత్తివేసినప్పటికీ.. ఇంకా కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

ఇటీవల ఇక్కడ న్యూజిలాండ్ ప్లేయర్లు కూడా కరోనా బారిన పడ్డారు. అయితే, భారత కెప్టెన్ గా, ఓపెనర్ గా ఉన్న రోహిత్.. వచ్చే నెల 1 నుంచి ప్రారంభమయ్యే టెస్టు ఆడేది అనుమానంగానే ఉంది. దీంతో ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ను హుటాహుటిన ఇంగ్లండ్ పంపారు. వాస్తవానికి మయాంక్ ను గాయపడిన కేఎల్ రాహుల్ స్థానంలో ఎంపిక చేసినా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలోనే ఉంచారు. అనూహ్యంగా ఇప్పుడు రోహిత్ కు పాజిటివ్ రావడంతో మయాంక్ ను జట్టుతో చేరాల్సిందిగా కోరారు.

కెప్టెన్ ఎవరు?

బహుశా వచ్చే నెల 1న జరిగే టెస్టు సమయానికి రోహిత్ కోలుకునే అవకాశం ఉన్నా.. ఆడతాడని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో కెప్టెన్సీ ఎవరు చేయాలనేది ప్రశ్న. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా దూరమైన నేపథ్యంలో.. పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ సారథ్యం వహించే అవకాశం కనిపిస్తోంది. అయితే, వీరిద్దరిలోనూ బుమ్రాకే ఎక్కువ అవకాశాలున్నాయి. చూద్దాం..? సారథి ఎవరో?