Begin typing your search above and press return to search.

గుండె మరణాల్లేవిక.. రోబోటిక్ గుండె ఆవిష్కరణ

By:  Tupaki Desk   |   23 Jan 2020 11:11 AM GMT
గుండె మరణాల్లేవిక.. రోబోటిక్ గుండె ఆవిష్కరణ
X
ఏదైనా సాధించడానికి మనిషికి గుండెధైర్యం కావాలంటారు. కానీ ఆ ‘గుండె’నే పనిచేయకపోతే.. మన ప్రాణాలు దక్కవు. మనిషిని మొత్తం నడిపించేది ‘గుండె’నే.. ఆ హృదయం లేకపోతే అంతే సంగతులు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆధునిక సమాజ పోకడలతో హార్ట్ ఎటాక్ లు 30 ఏళ్లకే వచ్చిపడుతున్నాయి. ఇక గుండెకు సంబంధించిన ఎన్నో జబ్బులు మనుషులను పట్టి పీడిస్తున్నాయి.

మనిషికి గుండెను ట్రాన్స్ ప్లాట్ చేయడం అంత ఈజీ అయిన వ్యవహారం కాదు.అదే బ్లడ్ గ్రూప్ సహా చాలా ఫ్యాక్టర్స్ కలిస్తేనే వేరొకరి గుండె.. మరికొరికి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులతో ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి.

తాజాగా నెదర్లాండ్స్, కేంబ్రిడ్జి, లండన్ లకు చెందిన వైద్య నిపుణులు అద్భుతాన్ని సాధించారు. ‘సాఫ్ట్ రోబోట్ హార్ట్’ను రూపొందించారు. వీరు చేసిన పరిశోధన 30 మిలియన్ యూరోల ప్రాజెక్టుకు ఎంపికై ప్రైజ్ మనీ దక్కడం విశేషం. అంటే రోబోటిక్ గుండె అన్నమాట.. 2028నాటికి గుండె మార్పిడి స్థానంలో ఈ రోబోటిక్ హార్ట్ ను అమర్చబోతున్నారన్న మాట..

ప్రస్తుతం దీన్ని అభివృద్ధి చేస్తున్నారు వైద్య నిపుణులు.. మూడేళ్లలోగా జంతువుల్లో తొలి నమూనాగా దీన్ని అమర్చే లక్ష్యంతో పరిశోధనలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ రోబోటిక్ గుండె శరీరమంతటికీ రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. మానవులకు ఈ గుండెను అమర్చే ప్రక్రియ మరో ఎనిమిదేళ్లలో అంటే 2028 వరకు అందుబాటులోకి రావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.అది వస్తే ఇక గుండెజబ్బులతో మరణించే వారే లేకుండా పోతారు. వైద్య చరిత్రలోనే ఈ రోబోటిక్ గుండె ఓ అద్భుతంగా వైద్యనిపుణులు చెబుతున్నారు.