Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఇమేజ్ పెరిగిందా ? త‌గ్గిందా?

By:  Tupaki Desk   |   21 May 2022 12:30 PM GMT
ప‌వ‌న్ ఇమేజ్ పెరిగిందా ? త‌గ్గిందా?
X
ఏపీ రాజ‌కీయాల్లో ప‌వ‌న్ స్థానం వేరు. ఆయ‌నేం మాట్లాడినా కూడా కొంత వ‌ర‌కూ ప్ర‌జ‌లను ఆక‌ట్టుకోవ‌డం అన్న ల‌క్ష్యంతో కాకుండా ప్ర‌జ‌ల బాగు కోరేందుకు ఉండే త‌ప‌న ఒక‌టి వెలుగులోకి వ‌స్తుంది అన్న‌ది ప‌రిశీల‌కుల మాట. మ‌రి! ఆయ‌న ఇమేజ్ పెరిగిందా ?త‌గ్గిందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ తో క‌లిసి బీజేపీ ప‌నిచేయ‌నుంది. ఇదే మంచి ఫ‌లితం కూడా ఇవ్వ‌నుంది అని బీజేపీ ఆశిస్తోంది.

కానీ ఓ విధంగా టీడీపీకి ఈ ఈక్వేష‌న్ అంత‌గా క‌లిసి రాదు అని అంటున్నారు కొంద‌రు. అందుకే ప‌వ‌న్ తో టీడీపీ వెళ్తే బాగుంటుంది అన్న ఆలోచ‌న కూడా కొంత వ‌ర‌కూ ప‌సుపు దండు నుంచే వినిపిస్తోంది. ఎలానూ లోకేశ్ పాద‌యాత్ర చేయ‌నున్నారు క‌నుక ఆయ‌న‌తో పాటే చంద్ర‌బాబు కూడా కొంత పార్టీ ప‌టిష్ట‌త‌కు చ‌ర్య‌లు తీసుకుని జ‌నంలోకి వెళ్తారు.

ఇదే స‌మ‌యం క‌న్నా ముందే ప‌వ‌న్ జ‌నంలోకి వెళ్లేందుకు యాత్ర చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు. అంటే లోకేశ్, చంద్ర‌బాబు, ప‌వ‌న్ మ‌రి కొద్ది రోజుల్లో ప్ర‌జా క్షేత్రంలో వైపీపీ పై నేరు పోరు సాగించ‌నున్నారు అన్న‌ది ఫిక్స్.

ప‌వ‌న్ ఇమేజ్ పెరిగిందా అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం వెత‌కాలి. 2014 నుంచి ఇప్ప‌టిదాకా ప‌ద‌వుల కోసం ప‌వ‌న్ వెంప‌ర్లాడ‌రు అన్న‌ది తేలిపోయింది. ఉద్దానం కిడ్నీ స‌మ‌స్య మొద‌లుకుని అనంత క‌రవు వ‌ర‌కూ మాట్లాడింది, నేరు కార్యాచ‌ర‌ణ‌కు సిద్ధం అయింది ప‌వ‌న్ మాత్రమే! అటుపై రాజ‌ధానికి సంబంధించి కూడా కొన్ని సంద‌ర్భాలో బాధిత వ‌ర్గాల‌కు అండ‌గా ఉండి, త‌న బాధ్య‌త నెర‌వేర్చారు.

అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నా కూడా తాను చెప్పాల‌నుకున్న నాలుగు మాట‌లూ చెప్పే వెళ్లారు. ఇవ‌న్నీ ప‌వ‌న్ ఇమేజ్ ను పెంచాయి. మంత్రులు అదే ప‌నిగా తిట్టినా కూడా ప‌వ‌న్ త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చారే కానీ నోరు జారి మరింత వివాదాలు సృష్టించ‌లేదు.ఇవి ఓ విధంగా ప‌వ‌న్ కు ప్ల‌స్ కానున్నాయి.ఇక మైన‌స్సులు ఏంటంటే ప‌వ‌న్ ఒక ఇష్యూని రైజ్ చేసి మ‌ధ్య‌లోనే వ‌దిలేస్తారు అని అంటారు.

ఆ విధంగా చేయ‌కుండా ఉంటే ప‌వ‌న్ మైలేజీ ఇంకాస్త పెరిగి ఉండేది. వ‌చ్చే ఎన్నికల్లో ఎలానూ టీడీపీతో కూడా ప‌నిచేసేందుకు ప‌వ‌న్ సిద్ధం అవుతున్నారు క‌నుక ఎక్కువ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై టీడీపీ నుంచి ముందొక సానుకూల వైఖ‌రి ప‌వ‌న్ పొందాలి. ఆ విధంగా పొంది ఉంటే ప‌వ‌న్ పొత్తు రాజ‌కీయ అవ‌స‌రం అనే కన్నా రాష్ట్ర ప్రయోజనాల‌కు అదొక సోపానం అన్న మాట‌ను ఫోక‌స్ చేయ‌వ‌చ్చు. ఆ విధంగా ప‌వ‌న్ పొలిటిక‌ల్ మైలేజీ కూడా పెరిగేందుకు ఛాన్స్ ఉంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ పొత్తు కార‌ణంగా టీడీపీ లాభం పొంద‌డం ఖాయం. కానీ జ‌న‌సేన అభ్య‌ర్థుల‌ను చెప్పుకోద‌గ్గ స్థానాల‌లో చంద్ర‌బాబు వ‌ర్గీయులు గెలిపించుకోక‌పోతే 2019 మాదిరిగా
పవ‌న్ ఒంట‌రి అయిపోవ‌డం ఖాయం.