Begin typing your search above and press return to search.

ఏపీ సీఎం జగన్ కు గుడి కడుతున్నారు

By:  Tupaki Desk   |   5 Aug 2020 4:00 PM GMT
ఏపీ సీఎం జగన్ కు గుడి కడుతున్నారు
X
తమిళనాట సంస్కృతి ఏపీకి విస్తరిస్తోంది. అభిమానం హద్దులు దాటి గుడులు గోపురాల వరకు వెళ్లింది. అభిమాన హీరోలు.. హీరోయిన్లు, రాజకీయ నేతలకు గుడి కట్టడం తమిళనాడులో ఫ్యాషన్ గా ఉంది.

ఇప్పుడు తమిళనాడుకు పొరుగునే ఆనుకొని ఉండే ఏపీలోనూ ఈ కల్చర్ వచ్చేసింది. ఏపీ సీఎం జగన్ పాలనకు ఫిదా అయ్యి ఏకంగా ఓ అభిమాని గుడికట్టేందుకు రెడీ అయ్యారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నేతలు ఏకంగా ఏపీ సీఎం జగన్ పాలనకు మైమరిచిపోయి గుడి కట్టేస్తున్నారు. జిల్లాలోని గోపాలపురం మండలం రాజంపాలెంలో ఈ గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ శంకుస్థాపన కూడా చేశారు.

జగన్ ఏపీలో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించారని.. ఈ పథకాలు భవిష్యత్ లో కూడా గుర్తుండి పోయేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా వైసీపీ నేత కూరకూరి నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. జగన్ ను ఒక దేవుడిలా కొలవాలనే ఉద్దేశంతోనే కోవెల కడుతున్నట్లు స్తానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ చెప్పారు. జగన్ చెంతకు ఏ దుష్టశక్తులు చేరకూడదనే లక్ష్యంతోనే గుడి నిర్మిస్తున్నట్టు వివరించారు.