ఒకేసారి ముగ్గురు యువ క్రికెటర్ల పెళ్లి.. అభిమానులకు స్వీట్ షాక్..!

Tue Nov 29 2022 14:11:36 GMT+0530 (India Standard Time)

Wedding of three young cricketers at the same time

శ్రీలంక జట్టు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తో మూడు వన్డేల సిరీసులను ఆడుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. మొదటి వన్డేలో ఆతిథ్య శ్రీలంక జట్టు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో అనుహ్యంగా ఓటమి పాలైంది. ఇక రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. దీంతో మూడు వన్డే సిరీసులో ఆప్ఘనిస్థాన్ 0-1తో లీడ్ లో ఉంది.ఈ రెండు జట్ల మధ్య మూడో వన్డే సిరీసు బుధవారం జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీసును సమం చేయాలని శ్రీలంక టీమ్ భావిస్తోంది. ఇక గత ఆదివారం మ్యాచ్ లో ఆడిన శ్రీలంక ముగ్గురు యువ క్రికెటర్లు ఆ తెల్లారే వివాహ బంధంలోకి అడుగుపెట్టి అభిమానులకు స్వీట్ షాకిచ్చారు.

శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిసాం (24).. ఆల్ రౌండర్ చరిత్ అసలంక (25).. పేస్ బౌలర్ కసున్ రజిత (29) కొలంబోలోని వివిధ వేదికల్లో వేర్వురుగా పెళ్లి చేసుకున్నారు. ఒకే రోజు ఈ ముగ్గురు క్రికెటర్లు వివాహా బంధంలోకి అడుగుపెట్టడంతో అభిమానులు వారికి పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వీరి వివాహాలను శ్రీలంక క్రికెట్ బోర్డు ధృవీకరించింది. ఈ మేరకు తమ ట్విట్టర్ హ్యాండిల్లో వీరి పెళ్లికి సంబంధించిన పలు ఫోటోలను పోస్ట్ చేసి నూతన వధూవరులకు కంగ్రాట్స్ చెప్పింది.

ఇక శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా వీరి వివాహాలు ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా సింపుల్ జరిగినట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా ఒకేరోజు ముగ్గురు శ్రీలంక యువ క్రికెటర్లు పెళ్లి పీఠ లెక్కడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. నూతనంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన పాతుమ్ నిసాం.. చరిత్ అసలంక.. కుసున్ రజితలు క్రికెట్ తోపాటుగా సంసారం జీవితంలోనూ రాణించాలని అభిమానులు కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.