Begin typing your search above and press return to search.

కరోనాతో కలిసి జీవించడం ఇలా ఉంటుంది

By:  Tupaki Desk   |   6 Jun 2020 11:50 AM GMT
కరోనాతో కలిసి జీవించడం ఇలా ఉంటుంది
X
కరోనాకు ముందు.. కరోనా తర్వాత ప్రపంచం మారిపోయింది. లాక్ డౌన్ లో ఉండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రపంచం తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. భయంతో, భద్రతతో బయట బతుకులు ఆరంభిస్తోంది. జీవితాలు పునప్రారంభమైన వేళ మన పద్ధతులు, అలవాట్లు, స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లు, జనసమూహాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

అంతా దూరం దూరం.. మనిషికి మనిషి మధ్య 6 అడుగుల దూరాన్ని ఈ మహమ్మారి పెట్టేసింది. విదేశాల్లోలాగా ఇక ముద్దులు పెట్టుకోలేం.. కనీసం హగ్గులు కూడా ఈ మాయదారి వైరస్ కారణంగా ఇచ్చుకోలేని పరిస్థితికి మనం దిగజారాం..

తరగతుల్లో విద్యార్థుల మధ్య దూరం పెరిగింది. వాళ్లు ఆప్యాయంగా.. ఏరా.. ఓరా అని పిలుచుకునే రోజులకు కాలం చెల్లింది. వారి మధ్య బెంచీలు, కూర్చీలు ఉన్నాయి.

పార్కుల్లో గీతలు గీసి కుటుంబాలు దూరం దూరం ఉండేలా నిబంధనలు పెట్టారు. సినిమాలు బహిరంగ ప్రదేశాల్లో కార్లలో చూడాల్సిన పరిస్థితులొచ్చాయి.

ఉద్యోగులు ఇంటికి పరిమితమై వర్క్ ఫ్రం హోం అంటున్నాయి. ఆఫీసుల్లోనూ చెట్టుకొకరు.. పుట్టుకొకరు టేబుల్ మీద శానిటైజర్ ను రుద్దుకుంటూ కనిపిస్తున్నారు.

షాపింగ్ లు దూరం దూరంగా.. రెస్టారెంట్లలో భోజనం టిఫిన్స్ తినడం కూడా దూరంగా కనిపిస్తోంది.

మొత్తంగా కరోనాకు ముందు ఎంత సందడిగా జనజీవనం నడిచిందో ఇప్పుడు అంత దూరంగా బతుకులు బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఫ్టర్ కరోనా మన జీవితాల్లో చాలా మార్పులు తెచ్చినట్టు కనిపిస్తోంది.