Begin typing your search above and press return to search.

అమెరికాలో టెకీల ఉద్యోగాలపై టెన్షన్ అక్కర్లేదు.. మనకున్న అవకాశాలివే..

By:  Tupaki Desk   |   5 Aug 2020 9:50 AM GMT
అమెరికాలో టెకీల  ఉద్యోగాలపై టెన్షన్ అక్కర్లేదు.. మనకున్న అవకాశాలివే..
X
కరోనా మహమ్మారితో ఈ రంగం ఆ రంగం అనే తేడా ఏమీలేదు. అన్నింటా సంక్షోభాలు నెలకొన్నాయి. సాఫ్ట్ వేర్ రంగంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. జనాభా పరంగా అతి పెద్దదైన మనదేశంలో ఐటీ నిపుణులు కూడా ఎక్కువే. మన సాఫ్ట్ వేర్లు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో పని చేస్తున్నారు. అయితే కరోనా ప్రభావం మొదలైన తర్వాత చాలా దేశాల్లో సాఫ్ట్ వేర్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. ఉద్యోగులను కూడా తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే విదేశాల్లో పని చేస్తున్న మన సాఫ్ట్ వేర్లు ఉద్యోగాలు పోగొట్టుకుని సొంతూళ్లకు చేరుకుంటున్నారు.

కొన్ని కంపెనీలు మాత్రం కాస్త వేతనం తగ్గించి వర్క్ ' ఫ్రమ్ హోమ్ ' కింద అవకాశం ఇచ్చాయి. ఇప్పటికే చాలా మంది టెకీలు తమ ఉద్యోగాలు పోగుట్టుకోగా ఇప్పుడు అమెరికా తీసుకున్న నిర్ణయాలు వారికి శరాఘాతంలా మారాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని, అన్ని ప్రభుత్వ సంస్థలను ఆదేశిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేశారు. అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించే సత్తా ఉన్న విదేశీయులకే హెచ్ 1బీ వీసాలని, తమ దేశస్తుల ఉద్యోగాలు లాక్కోవడానికి కాదంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

దీంతో అమెరికాలో పనిచేసే సాఫ్ట్ వేర్లు తమ ఉద్యోగాలు పోతాయోనని ఆందోళన చెందుతున్నారు. అయితే అమెరికా నిర్ణయాలపై అంత ఆందోళన అక్కరలేదని మనకున్న అవకాశాలు మనకున్నాయని హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) చెబుతోంది. మన దేశంలో వచ్చే మూడేళ్లకాలానికి 32 లక్షల సాఫ్ట్ వేర్ నిపుణులు అవసరమవుతారని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రైమ్ పేరుతో నూతన టెక్నాలజీపై శిక్షణ ఇచ్చే ప్రయత్నాలు చేప్పట్టిందని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా టాస్క్ అనే కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చినట్లు చెప్పింది.

హెచ్ 1బీ వీసాల జారీపై నిషేధంతో ఉండటంతో పలు కంపెనీలు భారత సాఫ్ట్ వేర్లకు ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగాలు ఇస్తున్నాయని హైసియా అధ్యక్షుడు, ఇన్ఫోఫీర్స్ సీఈవో భరణి కుమార్ అన్నారు. అమెరికాలో అన్ని కంపెనీలకు సరిపడా అత్యున్నత నైపుణ్యాలున్న ఐటీ నిపుణులు సరిపడా లేరని నిపుణుల కోసం కచ్చితంగా భారత్ పై ఆధార పడాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆయన చెప్పారు. అమెరికా నిర్ణయాల వల్ల ఇప్పటికిప్పుడు అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.