Begin typing your search above and press return to search.

డీసీకి వార్నర్.. ఆటగాళ్లను కొనడానికి బద్దకించిన సన్ రైజర్స్ హైదరాబాద్

By:  Tupaki Desk   |   13 Feb 2022 1:30 AM GMT
డీసీకి వార్నర్.. ఆటగాళ్లను కొనడానికి బద్దకించిన సన్ రైజర్స్ హైదరాబాద్
X
ఐపీఎల్ 2022 మెగా వేలం పొద్దున్నుంచి అంతరాయాల మధ్య సాగుతోంది. వేలం పాడే వ్యక్తికి సడెన్ గా కళ్లు తిరిగి పడిపోవడంతో భారత వ్యాఖ్యాత చారు శర్మ ఆ బాధ్యత తీసుకున్నారు. మధ్యాహ్నం 3.45కి తిరిగి వేలం ప్రారంభమైంది. ఈ ఏడాది భారత్‌లో అతిపెద్ద క్రికెట్ సీజన్ ఐపీఎల్ కోసం పూర్తిస్థాయి వేలం జరుగనుంది. గత సంవత్సరం సగం సీజన్ భారతదేశంలో జరిగింది.. మిగిలిన సగం సీజన్ యూఏఈలో జరిగింది. ప్రేక్షకుల హాజరు లేకుండానే ఈ ఏడాది ఐపీఎల్‌ భారత్‌లో జరుగుతుందని బీసీసీఐ ధృవీకరించింది. ఇదిలా ఉండగా తొలి వేలం పాటలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి.

10 ఫ్రాంచైజీల ముందు ఆటగాళ్లకు వేలం నిర్వహించారు. రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్యాట్ కమిన్స్, క్వింటన్ డి కాక్, శిఖర్ ధావన్, ఫాఫ్ డు ప్లెసిస్, శ్రేయాస్ అయ్యర్, కగిసో రబడ, మహ్మద్ షమీ, డేవిడ్ వార్నర్ వంటి స్టార్ ఆటగాళ్లు వేలంలో ఉన్నారు.

మొత్తం పది మంది ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ ను 15 కోట్లకు పైగా వెచ్చించి ముంబై కొనుగోలు చేసింది.వేలంలో ఇదే అత్యధిక మొత్తం కావడం గమనార్హం. అనంతరం శ్రేయాస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 12.25 కోట్ల రూపాయలకు పట్టుకుంది. రవిచంద్రన్ అశ్విన్ 5 కోట్ల రూపాయలకు తీసుకున్నాడు. డేవిడ్ వార్నర్ ఢిల్లీకి 6 కోట్లకే అమ్ముడు పోవడం షాకింగ్ గా మారింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి రౌండ్‌లో ఎలాంటి బిడ్‌లను తెరవకపోవడంతో నిరాశపరిచింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ పట్టుకుంది. ఇక జానీ బెయిర్ స్టోను సన్ రైజర్స్ వదులుకొంది. పంజాబ్ కొన్నది. ఇక సన్ రైజర్స్ రెండో వేలంలో 12 కోట్లకు పైగా వెచ్చించి వాషింగ్టన్ సుందర్ ను దక్కించుకుంది. ఆ తర్వాత నికోలస్ పూరన్ కు 10 కోట్లకు పైగానే వెచ్చింది. దేశీయ ప్లేయర్లు భువనేశ్వర్, నటరాజన్ ను కొనుగోలు చేసింది.

-ఆటగాళ్లు వారి ధరలు ఇవీ
శిఖర్ ధావన్
బేస్ ధర: 2 Cr
IPL 2021: DC – 5.20 Cr
IPL 2022: PK – 8.25 Cr

రవిచంద్రన్ అశ్విన్
బేస్ ధర: 2 Cr
IPL 2021: DC: 7.60 Cr
IPL 2021: RR: 5 కోట్లు

పాట్ కమిన్స్
బేస్ ధర: 2 Cr
IPL 2021: KKR: 15.50 కోట్లు
IPL 2022: KKR: 7.25 Cr

కగిసో రబడ
బేస్ ధర: 2 Cr
IPL 2021: DC: 4.20 Cr
IPL 2022: PK: 9.25 కోట్లు

ట్రెంట్ బౌల్ట్
బేస్ ధర: 2 Cr
IPL 2021: MI: 2.20 Cr
IPL 2022: RR: 8 Cr

శ్రేయాస్ అయ్యర్
బేస్: 2 Cr
IPL 2021: DC: 7 కోట్లు
IPL 2022: KKR: 12.25 కోట్లు

మహ్మద్ షమీ
బేస్: 2 Cr
IPL 2021: PBKS: 4.80 కోట్లు
IPL 2022: గుజరాత్ టైటాన్స్: 6.25 కోట్లు

ఫాఫ్ డు ప్లెసిస్
బేస్: 2 Cr
IPL 2021: CSK: 1.60 కోట్లు
IPL 2022: RCB: 7 కోట్లు

క్వింటన్ డి కాక్
బేస్: 2 Cr
IPL 2021: MI: 2.80 Cr
IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్: 6.75 కోట్లు

డేవిడ్ వార్నర్
బేస్: 2 Cr
IPL 2021: SRH: 12 Cr
IPL 2022: DC: 6.25 Cr

ఈ సంవత్సరం, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రెండు కొత్త జట్లు గుజరాత్, లక్నో చోటు చేసుకోనున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌లో మొత్తం పది జట్లు తలపడనున్నాయి.

ఐపీఎల్ కు వీవో తప్పుకోగా టాటా స్పానర్ గా నిలిచింది.