Begin typing your search above and press return to search.

కరోనా తగ్గదట .. షాకింగ్ కామెంట్స్ చేసిన డబ్ల్యూహెచ్‌వో ?

By:  Tupaki Desk   |   31 July 2021 2:30 PM GMT
కరోనా తగ్గదట .. షాకింగ్ కామెంట్స్ చేసిన డబ్ల్యూహెచ్‌వో ?
X
కరోనా వైరస్ మహమ్మారి థర్డ్‌ వేవ్‌ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. తాజాగా మరో వార్నింగ్‌ ఇచ్చింది. మళ్లీ కరోనా కల్లోలం సృష్టించబోతోంది అని హెచ్చరికలు జారీ చేసింది. గ‌త వారం రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 ల‌క్షల మంది కొత్తగా కరోనా మహమ్మారి బారినపడ్డారని తెలిపిన డ‌బ్ల్యూహెచ్‌ వో డైర‌క్టర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధ‌న‌మ్ గెబ్రియేస‌స్, మ‌రో రెండు వారాల్లోగా ఆ సంఖ్య 20 కోట్లకు చేరుతోందని తెలిపారు.

మ‌రో రెండు వారాల్లోగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొత్త‌గా 20 కోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదుకానున్నట్లు డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధ‌న‌మ్ గెబ్రియేస‌స్ వెల్లడించారు. గతవారం దాదాపు 40 ల‌క్ష‌ల కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా రెండు వారాల్లో 20 కోట్లు దాటే ప్ర‌మాదం ఉంద‌ని టెడ్రోస్ తెలిపారు. ఇది మా అంచ‌నాల ప్రకారం త‌క్కువే అని స్పష్టం చేశారు. కరోనా డెల్టా వేరియంట్‌ తో కొన్ని దేశాలు తిరిగి లాక్ డౌన్ బాట పట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెలుగుచూస్తున్న పాజిటివ్‌ కేసుల తీరును పరిశీలిస్తూ, ఈ అంచనా వేశారు. ఇక, ఇది మా అంచ‌నాల ప్రకార‌మే త‌క్కువే. మరింత ఎక్కువగానే ఉండొచ్చని శుక్రవారం రోజు మీడియాకు వెల్లడించారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌.. ఇదే కాకంగా అనేక దేశాల్లో డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్‌ వేరియంట్ కేసులు కూడా ఆందోళన కలిగిస్తున్న విషయం విదితమే.

కరోనా వైరస్ మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి అన్ని దేశాలను హెచ్చరించింది. ఒకసారి కరోనా నుంచి కోలుకున్న వారికి రెండోసారి ఈ వ్యాధి సోకదని కచ్చితంగా చెప్పలేమని డబ్ల్యూహెచ్‌ వో తెలిపింది. కరోనా కేసులు తక్కుతోన్న క్రమంలో కొన్ని దేశాలు లాక్‌ డౌన్‌ సడలింపులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న వారిని ఇమ్యూనిటీ పాస్‌ పోర్టులు (రిస్క్‌ ఫ్రీ సర్టిఫికేట్లు) ఇవ్వాలనే యోచనలో ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి శరీరంలో కరోనా నిరోధక యాంటీబాడీలు ఉన్న వారికి ఇవి ఇవ్వాలని అనుకుంటున్నాయి.

ఈ సర్టిఫికేట్లు పొందిన వారు ఆయా దేశంలో స్వేచ్ఛగా జీవించొచ్చు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఒకే వ్యక్తికి రెండుసార్లు కరోనా సోకదు అనేందుకు శాస్త్రీయమైన ఆధారేలీవీ లేవని స్పష్టం చేసింది. సర్టిఫికేట్లున్న వారు భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు పక్కనపెట్టడం వలన వారికి తెలీకుండానే వైరస్ వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదముందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది.

ఇదిలా ఉంటే .. దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 41,649 కరోనా కేసులు నమోదుకాగా 593 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,16,13,993కు చేరాయి. ప్రస్తుతం దేశంలో 4,08,920 యాక్టివ్‌ కేసులుండగా 3,07,81,263 మంది కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 4,23,810 మంది మృతి చెందారు.వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా దేశంలో వేగంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు 46,15,18,479 డోసులు పంపిణీ చేయగా ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.42శాతం ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు దేశంలో 46.64 కోట్ల కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.