Begin typing your search above and press return to search.

ధారావి పై ప్రసంశలు కురిపించిన WHO చీఫ్ !

By:  Tupaki Desk   |   11 July 2020 9:30 AM GMT
ధారావి పై ప్రసంశలు కురిపించిన WHO చీఫ్ !
X
ఆసియాలో అతిపెద్ద మురికివాడల్లో ముంబైలోని ధారవి కుడా ఒకటి. ఇరుకు ఇరుకు సంధులు , కామన్ బాత్ రూమ్స్ అక్కడ జీవిస్తున్న వారి జీతాలకి అద్దం పడతాయి. ఈ మురికివాడలో కరోనా వ్యాపిస్తే అరికట్టడం చాలా కష్టం అని భావించిన మహా సర్కార్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. అయితే , మహారాష్ట్ర లో ఉగ్రరూపం దాల్చిన కరోనా ధారవిలో ప్రవేశించి , ఆ అతిపెద్ద మురికివాడలో నివాసం ఉంటున్న వారి వెన్నులో వణుకుపుట్టించింది. కమ్యూనిటీ హెల్త్‌ కేర్‌ కార్మికులు, వైద్య బృందాలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బందిని అక్కడికి పంపి ఈ మురికివాడపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయగలిగింది . అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణ, వైరస్‌ బారిన పడిన వారికి తక్షణ చికిత్స, ఐసోలేషన్‌ నిబంధనలను పక్కాగా అమలు చేయడంతో ధారవి కరోనా పై విజయం సాధించింది.

ప్రజల సహకారం ఉంటే కరోనా వైరస్‌పై విజయం సాధించవచ్చని దారవి ఘటనే ఉదాహరణ అని, లాక్ ‌డౌన్‌ నిబంధనల సడలింపుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ ‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ గేబ్రియేసస్‌ శుక్రవారం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అయన జెనీవాలో నిర్వహించిన వర్చువల్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ .. ప్రపంచ వ్యాప్తంగా గత ఆరు వారాల్లో కరోనా కేసుల సంఖ్య దాదాపుగా రెట్టింపు అయ్యింది అని , అయితే అత్యధిక జనసాంద్రత కలిగిన కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ ను కట్టడి చేసిన తీరు గమనిస్తే.. కేసులు పెరిగినా మహమ్మారిని అదుపులోకి తీసుకు రావొచ్చనే విషయం స్పష్టమైందని తెలిపారు.

ఇందుకు ఇటలీ, స్పెయిన్‌, దక్షిణ కొరియా దేశాలు సహా ముంబైలోని ధారావి వంటి ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించిన తీరే నిదర్శనం అని , పరీక్షలు నిర్వహణ, ట్రేసింగ్‌, ఐసోలేషన్‌, అనారోగ్యంతో ఉన్న వారికి తక్షణ చికిత్స అందించడం వంటి విధానాలు వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేశాయి. మమమ్మారిని అణచివేయగలమని నిరూపించాయి అని తెలిపారు. ఇకపోతే , శుక్రవారం నాటికి ధారావిలో మొత్తంగా 2359 కేసులు నమోదు అవ్వగా .. ప్రస్తుతం కేవలం అక్కడ 166 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉండటం విశేషం.