Begin typing your search above and press return to search.

ప్రకాశం జిల్లాలో టీడీపీకి 12 శాతం ఓటు బ్యాంక్ పెరిగిందా...?

By:  Tupaki Desk   |   29 Aug 2022 1:30 PM GMT
ప్రకాశం జిల్లాలో టీడీపీకి 12 శాతం ఓటు బ్యాంక్ పెరిగిందా...?
X
2019 ఎన్నికల్లో వైసీపీకి లాండ్ స్లైడ్ విక్టరీ వచ్చినా కూడా ప్రకాశం జిల్లాలో నాలుగు సీట్లను టీడీపీ గెలుచుకుంది. పశ్చిమ ప్రకాశంలో వైసీపీకి కనీసంగా 40 నుంచి 80 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక తాజాగా చూస్తే రాష్ట్రమంతా పీకే టీమ్ మరియూ సీఎంఓ ఆఫీస్ పది చేసిన పది సర్వేల నుంచి వచ్చిన నివేదికల ప్రకారం చూస్తే కనుక చూస్తే ముఖ్యంగా పశ్చిన ప్రకాశం జిల్లాలో టీడీపీకి 12 శాతం ఓటు బ్యాంక్ పెరిగినట్లుగా చెబుతున్నాయట.

ఇక 2019 ఎన్నికల్లో రెడ్ల సీట్లను నాన్ రెడ్లకు ఇచ్చినా కూడా జగన్ని చూసి అప్పట్లో అందరూ పనిచేశారు. కానీ వచ్చే ఎన్నికల్లో చూస్తే ప్రతీ పంచాయతీలో ఇపుడు టీడీపీ పెద్ద ఎత్తున పుంజుకుంది. ఎందుకంటే ఎంపీటీసీ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీలో రెండు వర్గాలు పనిచేశాయి. ముఖ్యంగా రెడ్లు రెండు వర్గాలుగా విడిపోయారు అని అంటున్నారు.

ఇక ఇపుడు ఉన్న ఎమ్మెల్యేలను చూస్తే టీడీపీ రెడ్లకు సీట్లు ఇస్తుంది కాబట్టి మాకు లోకల్ గా రెడ్డి ఎమ్మెల్యే కావాలని అంటున్నారుట. ఒక వేళ వైసీపీ రెడ్లకు ఇస్తే వైసీపీ గెలుస్తుంది అని అంటున్నారుట. అలా కాదని ఇతరులకు ఇస్తే ప్రస్తుతానికి వైసీపీకే ఓటు వేస్తామని చెబుతున్నా కూడా చివరికి వారు ఎవరికి వేస్తారో తెలియదు.

ఇంటర్నల్ గా రెడ్డీ అభ్యర్ధికే ఓట్లు వేయించేలా కూడా చూస్తారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే టీడీపీ రెడ్లకు టికెట్ ఇస్తే వారికే ఆ ఓట్లు పోతాయి అని అంటున్నారు.

ఇలా ప్రకాశం జిల్లాలో కనుక చూస్తే కనిగిరి, దర్శి, గిద్దలూరులలో నాన్ రెడ్డీస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో అక్కడ ఉన్న లోకల్ పెద్ద రెడ్డి లీడర్స్ నుంచి రెడ్ సిగ్నల్ పడుతోందిట. ఇక్కడ ఆ ఎమ్మెల్యేలకు వీరికి అసలు పడడడంలేదు అని అంటున్నారుట. ఈ పరిణామాలు చూస్తే సామాజికంగా వైసీపీకి కొంప ముంచే విధంగా మారుతాయని అంటున్నారుట.

మరి ఈ రిపేర్లు అన్నీ వైసీపీ హై కమాండ్ ఎలా చేసుకుంటుంది అన్నది చూడాలి మరో వైపు టీడీపీ చాలా చోట్ల బలం పుంజుకోవడం కూడా మింగుడుపడని వ్యవహారమే. టీడీపీకి ఇప్పటికే ఓటు బ్యాంక్ పెరిగితే రానున్న ఎన్నికల్లో మరింతగా పెరగడం ఖాయమనే అంటున్నారు. దాంతో ప్రకాశం జిల్లాలో వైసీపీ రాజకీయ ప్రకాశం బాగా తగ్గిపోతుందా అన్న కంగారు అయితే పార్టీలో ఉందిట. చూడాలి మరి ఏం జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.