Begin typing your search above and press return to search.

నష్టాల్లో వొడాఫోన్ ఐడియా..1,500 మంది ఉద్యోగుల తొలగింపు!

By:  Tupaki Desk   |   5 Aug 2020 1:30 AM GMT
నష్టాల్లో వొడాఫోన్ ఐడియా..1,500 మంది ఉద్యోగుల తొలగింపు!
X
దేశీయ టెలింక రంగంలో అగ్రభాగాన దూసుకుపోతున్న వొడాఫోన్ ఐడియాకు నష్టాలు తప్పడం లేదు. నోకియా, ఎరిక్సన్, హువావే, జెటీఈ వంటి టెలికం గేర్ వెండర్స్ వొడాఫోన్ ఐడియా నుండి 4జీ పరికరాల కోసం కొత్త ఆర్డర్స్ తీసుకోవడంలో ఆలస్యంచేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం నగదు సమస్య. దీనితో వొడాఫోన్ ఐడియా వృద్ధి కాస్త మందగించింది. సబ్ ‌స్క్రైబర్లను కోల్పోతోంది. దీంతో వొడాఫోన్ ఐడియాను మరింత నష్టాలకు గురి చేస్తోంది.

ఈ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏజీఆర్ బకాయిల భారానికి తోడు నెట్ వర్క్ విస్తరణ పనులు నిలిచిపోవడం, డీల్స్ ఆలస్యం వంటి కొన్ని కారణాల వల్ల అధిక సంఖ్యలో ఉద్యోగులని తొలగించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా దాదాపు 1,500 మంది ఉద్యోగులను తొలగించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా వొడాఫోన్ ఐడియాకు సంబంధించి నోకియా, ఎరిక్సన్, హువావే, జెడ్‌ టీఈ 4జీ పరికరాల కొత్త ఆర్డర్స్ ఆలస్యం కావడం వల్ల సంస్థ మరింత ఇబ్బందుల్లోకి వెళ్లిందని భావిస్తున్నారు. చైనా నుండి ఆర్డర్స్ తీసుకోవడం కూడా ఆగిపోయి ఉండవచ్చునని అంచనా.

టెలికం సర్కిల్స్‌ను 22 నుండి 10కి కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. సర్కిల్స్ తగ్గిన నేపథ్యంలో దాదాపు 1500 మంది ఉద్యోగులపై వేటు పడిందని తెలుస్తోంది. గత క్వార్టర్ ‌లో వొడాఫోన్ ఐడియా సబ్ ‌స్క్రైబర్ల సంఖ్య భారీగా పడిపోయింది. ఏజీఆర్ మొత్తం బకాయిలు చెల్లిస్తే తమ ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడతాయని, ఈ క్రమంలో చెల్లింపులకు 20 ఏళ్ల సమయం కావాలని కూడా సుప్రీం కోర్టును కోరింది. కాగా, తొలగించిన ఉద్యోగులకు నిబంధనల మేరకు చెల్లింపులు చేయనున్నారు. సీనియర్ ఉద్యోగులకు నిష్క్రమణ నిబంధనలకు లోబడి ఏడు నెలల వేతనం అందించబోతుంది.