Begin typing your search above and press return to search.

దేశంలో ఉత్తమ నివాసయోగ్య నగరాల్లో 15వ స్థానంలో నిలిచిన వైజాగ్ !

By:  Tupaki Desk   |   5 March 2021 5:33 AM GMT
దేశంలో ఉత్తమ నివాసయోగ్య నగరాల్లో 15వ స్థానంలో నిలిచిన వైజాగ్ !
X
దేశంలో నివాస యోగ్య న‌గ‌రాల్లో మ‌న పొరుగునే ఉన్న బెంగ‌ళూరుకు అగ్రస్థానం దక్కించుకుంది. ‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌’ సూచీ జాబితాను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 111 నగరాలతో జాబితా రూపొందించింది కేంద్ర గృహ పట్టణ వ్యవహరాల మంత్రిత్వ శాఖ. ఇందులో బెంగళూరు టాప్ ర్యాంక్ లో నిలిచింది. ఆ తర్వాత పుణె, అహ్మదాబాద్‌, చెన్నై, సూరత్‌, నవీముంబయి, కోయంబత్తూర్‌, వడోదర, ఇండోర్‌, గ్రేటర్‌ ముంబయి టాప్‌ 10లో చోటు దక్కించుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉత్తమ నివాస యోగ్య నగరాల జాబితాలో విశాఖపట్నం 15వ స్థానం సాధించింది. ఏపీ నుండి ఈ క్యాటగిరీ లో టాప్‌ 20లో నిలిచిన ఏకైక నగరంగా విశాఖ మాత్రమే కావడం గమనార్హం. ఇక విజయవాడ 41వ స్థానంలో నిలిచింది.

సంస్థాగత, సామాజిక, ఆర్థిక, భౌతిక పరిస్థితులను కొలమానంగా తీసుకొని ఈ ర్యాంకుల్ని ప్రకటించారు. ఇందులో 15 కేటగిరీల్లో 78 సూచీలను విభజించి సర్వే నిర్వహించారు. ఇనిస్టిట్యూషనల్, భౌతిక పరిస్థితుల పరంగానూ విశాఖ నగరం మంచి ర్యాంకు సాధించింది. పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల జాబితాలో మొత్తం 100 పాయింట్లకు గాను 57.28 పాయింట్లు సాధించింది. 2018లో విడుదల చేసిన ర్యాంకుల్లో విశాఖ 17వ స్థానంలో నిలవగా ఈసారి 15 లో నిలిచింది. ఇక తెలంగాణ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ 24వ స్థానంలో నిలిచింది.

10లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో.. సిమ్లా ఈజ్ ఆఫ్ లివింగ్ ర్యాంకుల్లో నెంబర్‌ వన్‌గా ఉంది. ఈ కేటగిరీలో ఒడిశా రాజధాని భువనేశ్వర్, దాద్రానగర్ ‌హవేలిలోని సిల్వస్సా తర్వాతి స్థానాలతో టాప్‌ 3 లో నిలిచాయి. తెలుగురాష్ట్రాల్లోని నాలుగు నగరాలు ఈ ఇండెక్స్ ‌లో ప్లేస్‌ సంపాదించాయి. పోర్ట్‌ సిటీ కాకినాడ ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌లో 4 వ ర్యాంక్‌ దక్కించుకుంది. 19వ స్థానంలో వరంగల్, 22వ ప్లేస్‌లో కరీంనగర్, 46వ ర్యాంక్‌ లో తిరుపతి..10లక్షలలోపు జనాభా ఉన్న ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ సిటీల్లో చోటు సంపాదించాయి.

ఇక, మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ర్యాంకింగ్స్‌లో 10లక్షలపైన జనాభా కలిగిన నగరాల్లో మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ సిటీ టాప్ ‌లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్‌ లోని సూరత్, మధ్యప్రదేశ్‌ రాజధాని నిలిచాయి. మున్సిపల్‌ పెర్ఫార్మెన్స్‌ ర్యాంకింగ్స్‌లో వైజాగ్‌ నైన్త్‌ ప్లేస్‌ దక్కించుకుంటే..17వ స్థానంలో హైదరాబాద్ ఉంది. ఇక మున్సిపల్‌ పెర్ఫార్మెన్స్‌ ర్యాంకింగ్ ‌లో 10లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో..విజయవాడ 27వ ర్యాంక్‌ సాధించింది. మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ర్యాంకింగ్స్ ‌లో 10లక్షల లోపు జనాభా కలిగిన పట్టణాల్లో ఢిల్లీ పరిధిలోని ల్యుటెన్స్‌ టాప్ ‌లో ఉంటే…టెంపుల్‌ సిటీ తిరుపతి సెకండ్‌ ప్లేస్‌ దక్కించుకుంది.