కరోనా మహమ్మారి .. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ధనిక బీద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి వ్యాపిస్తుంది. అసలు ఈ మహమ్మారి ఎప్పుడు ఎక్కడ నుండి ఎవ్వరికి సోకుతుందో కూడా అర్థం కావడంలేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు వీఐపీలకు కరోనా తాకింది. లేటెస్ట్‌గా బీహార్ ముఖ్యమంత్రి నివాసంలో కరోనా వైరస్ ప్రవేశం జరిగింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మేనకోడలు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమెను పాట్నా ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
దీనితో
సీఎం నివాసాన్ని శానిటేషన్ చేయించారు. అలాగే త్వరలోనే ముఖ్యమంత్రి
నితీష్‌కుమార్ కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేసేందుకు ఏర్పాటు
చేస్తున్నారు. అలాగే కుటుంబం మొత్తాన్ని ఇంటి నిర్బంధంలో ఉంచారు.
మరోవైపు.. ఇప్పటికే సీఎం నితీష్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు.
అయితే ఆయనకు నెగటివ్ వచ్చింది. బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కొత్త
సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా సీఎం నితీష్ కుమార్ పక్కనే
కౌన్సిల్ చైర్‌పర్సన్ అవధేశ్ నారాయణసింగ్ కూర్చున్నారు.. అయితే.. ఆ
తర్వాత అవధేశ్ నారాయణసింగ్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన
విషయం తెలిసిందే.