Begin typing your search above and press return to search.

విరాట్ 'వీగన్' డైట్ ఎందుకు ఫాలో అవుతాడంటే?

By:  Tupaki Desk   |   19 Feb 2020 1:30 PM GMT
విరాట్ వీగన్ డైట్ ఎందుకు ఫాలో అవుతాడంటే?
X
విరాట్ కోహ్లీ .. ప్రస్తుత ప్రపంచ నెంబర్ వన్ క్రికెటర్. రికార్డుల రారాజు. ఒక్కసారి బ్యాట్ పట్టి గ్రౌండ్ లోకి దిగితే , కోహ్లీని అడ్డుకోవాలంటే ప్రత్యర్దులకి చాలా కష్టం. ఇప్పటికే క్రికెట్ లో నమోదైన ఎన్నో రికార్డ్స్ ని బద్దలు కొట్టి, సరికొత్త రికార్డ్స్ ని తన పేరుమీద లిఖించుకున్నాడు. ప్రస్తుతం అరవీరభయంకరమైన బ్యాటమెన్ గా , ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అయితే , కొన్నేళ్లుగా క్రికెట్ ఆడుతున్నప్పటికీ కోహ్లీ లో ఏ మాత్రం కసి తగ్గకపోవడానికి , అలుపు రాకపోవడానికి కారణం కోహ్లీ ఫాలో అయ్యే డైట్ . అవును ..కోహ్లీ ఫాలో అయ్యే డైట్ ని ఫాలో అవ్వాలి అంత సులభం ఏమి కాదు. ప్రస్తుతం కోహ్లీ వీగన్ డైట్ ఫాలో అవుతున్నాడు.

అసలు వీగన్ డైట్ అంటే ఏమిటంటే ...ఈ డైట్ లో పూర్తిగా మొక్కల ద్వారా వచ్చే ఆహారాన్నే తీసుకోవాలి. అంటే మాంసాన్ని మాత్రమే కాకుండా ఇందులో జంతువుల నుంచి ఉత్పత్తయ్యే పాలు, పెరుగు, నెయ్యి , తేనె లాంటి వాటి జోలికి పోకూడదు. అయితే,ఈమధ్య క్రీడాకారులు ఎక్కువగా తమ ఫిట్నెస్ పై దృష్టి పెట్టి ఈ వీగన్ డైట్ ఫాలో అవుతున్నారు. క్రీడాకారులకు ముఖ్యంగా ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, విటమిన్ డి లాంటి పోషకాలతో పాటు ఫ్యాటీ ఆమ్లాలు కూడా చాలా అవసరం. సాధారణంగా క్రీడాకారులకు దెబ్బలు తాకడం అనేది మాములే ,ఆలా గాయాల భారిన పడిన సమయంలో త్వరగా కోలుకోవడానికి ఈ వీగన్ డైట్ తోడ్పడుతుంది అని నిపుణులు చెప్తున్నారు.

ఈ వీగన్ డైట్‌ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి , అది అధిక బరువు లేకుండా తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ డైట్ వల్ల రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. మధుమేహం, కేన్సర్ బారిన పడే ప్రమాదమూ తగ్గుతుంది. అయితే , ఎవరు పడితే వారు ఈ వీగన్ డైట్ ఫాలో అయితే ప్రాణాలమీదకు తెచ్చుకున్నట్టే ..ఈ వీగన్ డైట్ వల్ల మైక్రో న్యూట్రియంట్ల లోపం తలెత్తుతుంది. శరీరంలో ప్రొటీన్ల లోపమూ తలెత్తే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా వీగన్ డైట్‌ లో సరైన పోషకాల సమతుల్యత ఉండాలి. వైద్యుల సలహాతోనే ఈ డైట్‌ ను పాటించాలి.