ఫిట్ నెస్ విషయంలో తగ్గెదేలే అంటున్న 'కింగ్' కోహ్లీ.. వైరల్ వీడియో..!

Thu Nov 24 2022 19:12:18 GMT+0530 (India Standard Time)

Viral video of 'King' Kohli exercises in the gym.. Must see..!

టీంఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారనీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కింగ్ కోహ్లీ స్టేడియంలో పరుగుల వరద పారించేందుకు ఎంత ఇష్టపడుతాడో.. అంతే ఇష్టాన్ని జిమ్ లో గడిపేందుకు ఆసక్తిని చూపుతుంటాడు. గంటల కొద్ది సమయాన్ని జిమ్ లో వెచ్చిస్తూ భారీ భారీ కసరత్తులు చేస్తూ ఫిట్ గా మారుతుంటాడు.మైదానంలో చిరుత పులిలా కింగ్ కోహ్లీ పరిగెత్తుత్తూ ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టిస్తుంటాడు. బ్యాటింగ్ ఒక రన్ వచ్చే చోట రెండు.. మూడు పరుగులు తీయడం కోహ్లీ స్పెషాలిటీ. అలా జట్టుకు అదనపు పరుగులు తీసుకొస్తూ ఉంటాడు. ఫీల్డ్ లో మెరుపు వేగంతో స్పందిస్తూ ప్రత్యర్థులను కట్టడి చేస్తూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ అభిమానుల్లో హుషారు నింపుతుంటాడు.

టీ20 వరల్డ్ కప్ కు ముందు వరకు కూడా కోహ్లీ ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డాడు. టీ20లో పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అర్ధ శతకంతో ఫామ్ లోకి రావడంతో పాటు జట్టుకు విజయ తీరాలకు చేర్చాడు. వరల్డ్ కప్ లో నాలుగు హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు భారత్ తరుపున అత్యధిక పరుగులు చేయడంతో పాటు టీ20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

విరామ సమయంలో విరాట్ కోహ్లీ కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడుతుంటాడు. ఈక్రమంలోనే ఇంట్లోనే తన భార్య అనుష్క శర్మతో జిమ్ చేస్తూ ఉంటాడు. వీరిద్దరికి సంబంధించిన పలు వీడియోలను కోహ్లీ ఇప్పటికే పలుసార్లు పోస్ట్ చేశాడు. తాజాగా మరోసారి తాను వర్కౌట్ చేస్తున్న జిమ్ వీడియోను కోహ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.

కింగ్ కోహ్లీ జిమ్ వీడియో చూసిన అభిమానులు అతడి ఫిట్ నెస్ పై చర్చించుకుంటున్నారు. కోహ్లీ బాడీ సూపర్బ్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫిట్ నెస్ లో నిన్ను మించిన ఆటగాడు ఎవరూ లేరంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కోహ్లీ వీడియో పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోండి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.