వివాహితకు లవ్ లెటర్ ఇచ్చిన గ్రామవాలంటీర్.. ఆ తరువాత !

Tue Aug 04 2020 17:20:02 GMT+0530 (IST)

Village volunteer who gave love letter to the bride .. after that!

గ్రామ వలంటీర్ వ్యవస్థ .. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడప వద్దకే ప్రభుత్వ పథకాల్ని తీసుకువెళ్లేలా ఈ గ్రామ వలంటీర్ వ్యవస్థ ను అమల్లోకి తీసుకువచ్చారు. చాలామంది గ్రామ వలంటీర్లు ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ప్రవర్తిస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఊర్లోకి కొత్తగా ఎవరు వచ్చినా కూడా వారికీ కరోనా నిబంధనలు తెలపడం టెస్టులు చేపించడం వంటి పనులు చేస్తున్నారు. అయితే కొంతమంది చేసే చెడ్డ పనులవల్ల మొత్తం గ్రామ వలంటీర్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. తాజాగా ఓ గ్రామ వలంటీర్ వివాహితకి లవ్ లెటర్స్ రాస్తూ వేధింపులకు దిగాడు. వాలంటీర్ ను ఆ వివాహిత అన్నా అని పిలుస్తున్నా కూడా కామంతో కళ్లుమూసుకుపోయిన ఆ కామాంధుడు ఆమె పై వేధింపులకు దిగాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా నార్పల మండలంలో వెలుగుచూసింది.పూర్తి వివరాలు చూస్తే .. ఉయ్యాలకుంట గ్రామంలో ఓ యువకుడు వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితను కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఆమె ఇంటికి క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు వెళ్లిన ఆ వాలంటీర్ ‘ఐ లవ్ యూ’ అంటూ రాసిన పేపర్ ను చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. ఆ పేపర్‌ను చూసి షాకైన ఆ మహిళ విషయాన్ని భర్తకు తెలియజేసింది. దీంతో అతడు తన బంధువులు స్థానికులతో కలిసి ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకి దిగారు. తన భార్యపై వేధింపులకు పాల్పడుతున్న గ్రామ వాలంటీర్ సుబ్రమణ్యాన్ని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని అసలు మహిళలపై వేధింపులకి పాల్పడమని ఈ ఉద్యోగం ఇచ్చారా అంటూ అక్కడి అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై ఎంపీడీఓ తహసీల్దార్ స్పందించి గ్రామ వలంటీర్ ను విధుల నుంచి తప్పిస్తామని తెలిపారు.

ఈ ఘటనపై బాధితురాలు మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్ ను అన్న అని పిలుస్తుంటానని కానీ అతడు ఇలా చేస్తాడని ఊహించలేదని చెబుతోంది. గతంలో ఓ సారి కాగితంపై ఇంగ్లీషులో ఏదో రాసిచ్చి చదువుకోమన్నాడని తెలిపింది. అయితే తనకు ఇంగ్లీష్ చదవడం రాదని చెప్పడంతో సోమవారం తెలుగులో ‘ఐ లవ్ యూ’ అని రాసిచ్చాడని తెలిపింది. ఏదేమైనా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని గ్రామవాలంటీర్ వ్యవస్థ ను తీసుకువస్తే ..ఇలాంటి వారి వల్ల దానికి చెడ్డపేరు వస్తుంది.