Begin typing your search above and press return to search.

లాయ‌ర్ మాటలే వాస్త‌వ‌మ‌య్యాయి: సాయంత్రం పిల్..తెల్లారి ఎన్‌‌ కౌంట‌ర్‌!

By:  Tupaki Desk   |   10 July 2020 7:15 AM GMT
లాయ‌ర్ మాటలే వాస్త‌వ‌మ‌య్యాయి: సాయంత్రం పిల్..తెల్లారి ఎన్‌‌ కౌంట‌ర్‌!
X
కాన్పూర్ గ్యాంగ్‌ స్టర్ వికాస్ దూబే ఎన్‌ కౌంటర్ దేశ‌ వ్యాప్తం గా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శుక్ర‌వారం ఉద‌యం అత‌డి ఎన్‌ కౌంట‌ర్ దేశ‌వ్యాప్తంగా దావానంలా వ్యాపించింది. ఇంత‌కీ అత‌డెవ‌రంటే ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌ లో 8మంది పోలీసుల హ‌త్య‌ కు కార‌కుడు. ఓ మంత్రి హ‌త్య‌ లో ప్ర‌ధాన నిందితుడు. అత‌డి ఎన్‌ కౌంట‌ర్ ఉత్తర ప్రదేశ్‌ లోని ఝాన్సీ-కాన్పూర్ మార్గం లో జరిగింది. మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయినిలో దూబే అరెస్ట్ చేసి అతడిని కాన్పూర్ తరలిస్తున్న క్ర‌మంలో ఎన్‌ కౌంటర్ చోటుచేసుకుంది. అయితే అంత‌కు ముందు త‌ర‌లిస్తున్న క్ర‌మం లో మార్గ మధ్య లో కారు బోల్తా పడగా అతడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమం లో అతను ఓ పోలీస్ అధికారి నుంచి గన్ లాక్కుని పారి పోయేందుకు యత్నించ గా కాల్పులు జరిపినట్లు స్పష్టం చేశారు.

అయితే దేశం లో జ‌రిగే ప్ర‌తి ఎన్‌ కౌంటర్ సామాన్యుల‌తో పాటు అంద‌రికీ తెలిసే జ‌రుగుతాయి. పోలీసులు చేసే ఎన్‌ కౌంట‌ర్లు ఒక మూస ప‌ద్ధ‌తి లో చోటు చేసుకుంటాయి. న్యాయ‌ స్థానాలు.. మాన‌వ హ‌క్కుల సంఘం నుంచి త‌ప్పించుకోవ‌డానికి పోలీసులు ఒక క‌థ చెబుతారు. ఆ క‌థ మాదిరే ఎన్‌కౌంట‌ర్లు జ‌రిగిన‌ట్టు సృష్టిస్తారు. ఆ విధంగానే వికాస్ దుబే ఎన్‌ కౌంట‌ర్ జ‌రిగింది. అయితే ఇలా జ‌రుగుతుంద‌ని ఓ న్యాయ వాది ముందే ఊహించారు. ఇలా జ‌రుగుతుంద‌ని భావించే గురువారం (జూలై 9) ఆయన సుప్రీం కోర్టు లో పిటిష‌న్ కూడా వేశారు.

దుబే అరెస్ట్‌పై ముంబై కి చెందిన న్యాయవాది గణ్ శ్యామ్ ఉపాధ్యాయ్ దూబే గురువారం సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖలు చేశారు. దూబేని 'ఫేక్ ఎన్‌కౌంటర్' చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పిటిష‌న్‌ లో ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇప్పటికే అతడి అనుచరులు నలుగురిని ఎన్‌కౌంటర్ చేశార‌ని గుర్తుచేశారు. ఆ క్ర‌మంలోనే దుబేను కూడా ఎన్‌కౌంటర్ చేసే అవకాశం ఉందని గుర్తు చేశారు. దుబేపై తనకేమీ సానుభూతి లేదని ఆ న్యాయ‌వాది స్ప‌ష్టం చేశారు. అయితే అఫ్జల్ గురు, అజ్మల్ కసబ్ లాంటి వాళ్లకు న్యాయపరమైన విచారణ అవకాశం ఇచ్చార‌ని దూబే కు కూడా న్యాయ పరమైన విచారణ జరగాలని ఈ సంద‌ర్భం గా న్యాయ‌వాది గ‌ణ్‌ శ్యామ్ కోరారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఉత్తర ప్రదేశ్ పోలీసు లు అతడిని కాల్చి చంపే అవ‌కాశాలు ఉన్నాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

వికాస్ దూబే క‌రుడుగ‌ట్టిన నేర‌స్తుడు. అత‌డి పై ఇప్పటి వరకు 60 కేసులు ఉన్నాయి. వీటిలో ఐదు హత్య కేసులు కూడా ఉన్నాయి. 8 హత్యాయత్నం కేసులు వివిధ పోలీస్‌ స్టేష‌న్‌ ల‌లో నమోద‌య్యాయి. ఎప్పటికప్పుడు బెయిల్ పొందుతూ బయట స్వేచ్ఛ‌ గా తిరుగుతున్నాడు. పోలీసులు అవినీతి కి లొంగడం తోనే దూబే నేర కార్య కలాపాలు ఇలా యథేచ్చ గా సాగాయని న్యాయవాది గణ శ్యామ్ తెలిపారు. దూబే అనుచరుల ఎన్‌ కౌంటర్‌ పై సీబీఐ విచారణ జరిపించాలని న్యాయవాది సుప్రీంకోర్టు ను కోరారు. పోలీసులు - రాజకీయ నాయకుల తో దూబే లింకుల పై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఆ విధంగా న్యాయ‌వాది ఊహించిన‌ట్టు తెల్లారే దుబే ఎన్‌ కౌంట‌ర్ జ‌రిగింది.