దీపిక కిడ్నాప్ కేసు సుఖాతం.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన యువతి!

Tue Sep 29 2020 18:00:47 GMT+0530 (IST)

Vikarabad Kidnap Case

వికారాబాద్ లో ఆదివారం  కిడ్నాప్ కు గురైన దీపిక కేసు ఊహించని మలుపు తిరిగింది. గత మూడు రోజులగా ఆమె కోసం ఆరు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపడుతున్న పోలీసులకు యువతి షాక్ ఇచ్చింది. తాను ఇష్టపూరితంగానే భర్త అఖిల్ తో వెళ్లినట్టు పోలీసులకు తెలిపింది. ఈ మేరకు మంగళవారం వికారాబాద్ పోలీసులకు ఫోన్ చేసిన దీపిక.. తాను అఖిల్ వద్ద క్షేమంగానే ఉన్నట్లు తెలిపింది. పోలీసుల సూచన మేరకు కాసేపట్లో వీరిద్దరు వికారాబాద్ పోలీస్ స్టేషన్ వద్దకు రానున్నారు. దీపిక కథ సుఖాతం కావడం తో  దీపిక కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇంట్లో నుండి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది.వికారాబాద్ కు చెందిన దీపిక అఖిల్ 2016లో ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం రెండు సంవత్సరాల క్రితం అమ్మాయిని తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల బలవంతం మేరకు అఖిల్ నుంచి విడాకులు కోరుతూ దీపిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే గత శనివారం ఇరువురు వికారాబాద్ కోర్టు కు హాజరయ్యారు. అనంతరం అదే రోజు సాయంత్రం దీపిక షాపింగ్‌కు వెళ్లి ఇంటికి వెళ్తుండగా.. ఓ కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆ యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని పోయారు. దీనితో దీపిక కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేశారు.