వాడు చెప్పేదంతా పచ్చి అబద్దం .. ఎన్ కౌంటర్ చేసేయండి యువతి తండ్రి డిమాండ్

Sat Oct 17 2020 18:00:58 GMT+0530 (IST)

Everything he says is a blatant lie .. Encounter the demand of the young woman's father

విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో బలైన యువతి కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. పోలీసుల విచారణ జరిగేకొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందుతుడు హాస్పిటల్ లో మాట్లాడుతూ ఆ అమ్మాయి తాను పెళ్లి చేసుకున్నామని యువతి ఇంట్లో తల్లిదండ్రులు వారి పెళ్లిని అంగీకరించకపోవడంతోనే ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని ఎవరు గొంతు వారే కోసుకున్నామ చెప్పాడు. అయితే. నిందుతుడు చెప్పేది మొత్తం అబద్దం అని భాదిత యువతి తల్లిదండ్రులు చెప్తున్నారు.ఈ కేసును విజయవాడ పోలీస్ స్టేషన్ నుంచి దిశ స్టేషన్ కు కేసును బదిలీ చేశారు. ఇక ఈ కేసు విచారణలో భాగంగా యువతి తల్లిదండ్రులు సోదురుడ్ని పోలీసులు విచారణకు పిలిచారు. యువతి తండ్రి జోసెఫ్ నిందితుడు నాగేంద్రపై పలు ఆరోపణలు చేశారు. నాగేంద్ర కి ఉరి శిక్ష పడాలని లేకపోతే ఎన్ కౌంటర్ చేయాలని తమకు న్యాయం చేయాలన్నారు. అత్యంత కిరాతకంగా దివ్యను హత్య చేశాడడని.. 13 కత్తి పోట్లే నాగేంద్ర కిరాతకానికి నిదర్శనం అని అన్నారు.

ఇంట్లో పడుకున్న అమ్మాయిని నిద్రలోనే హతమార్చాడని నాగేంద్ర అమ్మాయిని చంపి తను మాత్రం చిన్న గాయాలు చేసుకున్నాడన్నారు. హత్యకేసు నుంచి తప్పించుకోవడానికే మీడియాతో మాట్లాడుతున్నాడని పెళ్లి ఇతర విషయాలు నిజం కాదన్నారు. ఫోటోలను మార్ఫ్ చేసి పెళ్లి చేసుకున్నట్లుగా కట్టుకథలు చెప్తున్నాడు అంటూ దివ్య తల్లిదండ్రులు మండిపడుతున్నారు. దివ్యకు నాగేంద్రతో వివాహం అనేది నిజం కాదు అని ఆ యువతి సోదరుడు చెప్తున్నాడు. దివ్యకు నాగేంద్రతో ఇటీవలే పరిచయం ఏర్పడిందని దివ్య తన ఆవేదన బాధ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని అసలైన నిజాలు పోలిసుల విచారణలో వెలుగులోకి వస్తాయని అన్నారు.

ఇక మరోవైపు పోలీసుల విచారణలోసరికొత్త విషయాలు బయటపడుతున్నాయి. యువతి నాగేంద్ర వివాహంపై అధికారిక ధ్రువీకరణ దొరకలేదని చెప్తున్నారు. 2018 మార్చిలో దివ్వ నాగేంద్ర మంగళగిరి పానకాల స్వామి ఆలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. విచారణలో వివాహమైనట్లు ఏ వివరాలు నమోదు కాలేదని పోలీసులు అంటున్నారు. అయితే ఆ ఫోటో ఎలా వచ్చిందనే అంశంపై కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.