బాబు టాలెంట్ నే సవాల్ చేస్తున్న విజయసాయిరెడ్డి

Sat Dec 03 2022 19:03:00 GMT+0530 (India Standard Time)

Vijayasai Reddy is challenging chandraBabu Talent

ఏపీలో ఇపుడు వైసీపీ టీడీపీల మధ్య వార్ భీకరంగా సాగుతోంది. ఒకటి తరువాత ఒకటి ఇష్యూ వస్తూనే ఉంది. ప్రతీ దాంట్లో రాజకీయ లాభాన్ని చూసుకుంటూ రెండు పార్టీలు రెచ్చిపోవడం కామన్ గా ఉంటోంది. ఈ నేపధ్యంలో అమరరాజా బ్యాటరీస్ సంస్థ హైదరాబాద్ కి తాజాగా వెళ్లిపోయిన వ్యవహారం ఏపీ రాజకీయ తెర మీదకు వచ్చి రచ్చ రచ్చ చేస్తోంది. ఏపీలో పెట్టుబడులు అన్నీ తరలిపోతున్నాయి అంటూ టీడీపీ నాయకులు దాని అనుకూల మీడియా దీని మీద మండిపడుతున్నాయి. వైసీపీ ఏలుబడిలో ఇలా అంతా జరుగుతోందని కూడా ఒక్క లెక్కన దుయ్యబెడుతున్నాయి.ఈ నేపధ్యంలో కౌటర్ అటాక్ వైసీపీ నుంచి కూడా స్టార్ట్ అయింది. మంత్రి అమరనాధ్ అయితే కేవలం ఏపీలోనే అమరరాజా బ్యాటరీస్ పెట్టుబడులు పెట్టాలా అది రూలా ఆ సంస్థ విస్తరణ జరుగుతోందని అన్నారు. పైగా అమరరాజా తాము తెలంగాణాకు తరలిపోతున్నాట్లుగా ఎక్కడా చెప్పలేదు అని కూడా పేర్కొన్నారు. ఆయన అలా మాట్లాడితే విజయసాయిరెడ్డి మరోలా రెస్పాండ్ అయ్యారు.

ఆయన ఏకంగా చంద్రబాబు టాలెంట్ నే క్వశ్చన్ చేస్తూ ట్విట్టర్ లో ట్వీట్ పెట్టి రచ్చను మరింత కాక పుట్టించారు. మాట్లాడితే విదేశీ పెట్టుబడులు లక్షల కోట్లలో తెస్తాను అని గొప్పలను పోతావు కదా బాబూ మీ సొంత పార్టీ ఎంపీ పక్క రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతూంటే చూస్తూ ఏం చేశావంటూ తగులుకున్నారు. అంతే కాదు ఏకంగా 9500 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెడుతూంటే చంద్రబాబు ఆ విషయంలో ఏమీ మాట్లాడడం లేదని ఇదంతా అవకాశ వాదమే అని విమర్శించారు.

అంటే కూడబలుక్కునే ఏపీ పెట్టుబడులను తెలంగాణాలో పెట్టిస్తున్నారు అని అర్ధం వచ్చేలా విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ చేశారు. నీ సమర్ధత ఎంతో తెలిసింది. సొంత ఎంపీని కూడా ఏపీలో ఉంచలేకపోయారు కానీ విదేశీ పెట్టుబడులు అంటున్నావు అని బాబు మీద విరుచుకుని పడ్డారు. మొత్తానికి అమరరాజా  పెట్టుబడులు తెలంగాణాలో పెట్టడం కాదు కానీ ఏపీలో మాత్రం వైసీపీ టీడీపీ రెండూ కూడా తమదైన వాదనలు వినిపిస్తున్నాయి.

ఏపీలో పెట్టుబడులు ఎవరూ పెట్టకపోవడానికి జగన్ సర్కార్ విధానాలే కారణం అని టీడీపీ అంటోంది. వేధింపులకు పారిశ్రామికవేత్తలను గురి చేయడం వల్లనే ఇలా జరుగుతోంది అని కూడా విమర్శలు చేస్తున్నారు. ఇక ఏపీ సెంటిమెంట్ ని కూడా తెచ్చి మరీ వైసీపీ రివర్స్ లో అటాక్ చేస్తోంది.

ఏపీలో రాజకీయాలు చేస్తారు తెలంగాణాలో వ్యాపారాలు చేస్తారు. ఏపీలో పుట్టి పెరిగి అన్నీ ఏపీ నుంచి తీసుకున్న వారికి ఏపీ అంటే పట్టడంలేదు అని వైసీపీ కామెంట్స్ చేస్తోంది అన్న మాట. ఇందులో ఏవి నిజాలు ఏవి విమర్శలు వేటిని జనాలు నమ్ముతున్నారు అసలు అమరరాజా సంస్థ ఆలోచనలు ఏమిటి అన్నవి ఎవరికీ అక్కరలేదు. ఈ రాజకీయ సమరం అలా సాగిపోవాల్సిందే అన్నట్లుగా సీన్ ఉంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.