బాబు చేయలేని పనిని సవాలు విసిరిన విజయసాయి

Sun Feb 21 2021 15:00:02 GMT+0530 (IST)

Vijay sai challenged Babu

ఏపీలో ఇప్పుడు రెండు అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. అందులో ఒకటి పంచాయితీ ఎన్నికలు అయితే.. రెండోది విశాఖ ఉక్కు కర్మాగారాన్నిప్రైవేటు పరం కాకుండా కాపాడాలి. ఈ రెండు విషయాల్లోనూ అధికార పక్షంతో పోలిస్తే.. విపక్షాలు చాలా వెనుకబడిపోయాయని చెప్పాలి. దీనికి తగ్గట్లే తాజాగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరించటాన్ని వ్యతిరేకిస్తూ.. ఏపీ అధికారపక్షం ఒకటి తర్వాత మరొకటి చొప్పున నిర్ణయాల్ని తీసుకుంటోంది.అందులో భాగంగానే విజయసాయి తాజాగా పాదయాత్రను నిర్వహించారు. విశాఖ ఉక్కు విషయంలో బాబు ఏమీ చేయలేరన్న విసయాన్ని ఆయనకు అర్థమయ్యేలా చేస్తున్నారు అధికారపక్ష నేతలు. విశాఖ ఉక్కును కాపాడుకోవటమే బాబు ఆలోచన అయితే.. ఇప్పటికే ఆయన ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లాల్సి ఉంది. రాష్ట్రపతి కోవింద్ ను.  ప్రధాని మోడీ.. ఇలా ప్రముఖుల్ని కలవటం.. ఏపీ ప్రజల ఆకాంక్షను వినిపించాల్సిన అవసరం ఉంది. అయితే.. ఇలాంటివేమీ జరగకపోవటం గమనార్హం.

విశాఖ ఉక్కు కర్మాగారాన్నికాపాడుకోవటం కోసం పాదయాత్రను చేపట్టిన విజయాసాయి.. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ...ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. బాబుకు విశాఖ ఉక్కు మీద కమిట్ మెంట్ ఉంటే..ఒకసారి ప్రదాని మోడీని కలిసి.. ఆయనకు విషయాన్ని వివరించే సాహసం చేయగలరా? అని ప్రశ్నించారు. విన్నంతనే టెంప్టు అయ్యేలా ఈ భేటీ సవాలు ఉన్నప్పటికీ.. బాబు స్పందించినా పీఎంవో అందుకు సానుకూలంగా రియాక్టు అవుతుందా? అన్నది మరో ప్రశ్న. ఎందుకంటే..బాబును ఏ మాత్రం విశ్వాసంలోకి తీసుకునేందుకు ప్రధాని మోడీ ఇష్టపడటం లేదని చెబుతారు. ఈ సంగతి తెలుసు కాబట్టే.. తన మాటలతో బాబును విజయసాయి మరోసారి ఫిక్స్ చేశారని చెప్పక తప్పదు. మరి.. విజయసాయి సవాలుకు బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.