Begin typing your search above and press return to search.

చీకటి రోజన్న బాబు..'వెలుతురు రోజు‘ గుర్తు చేసిన విజయసాయిరెడ్డి

By:  Tupaki Desk   |   11 Sep 2019 12:56 PM GMT
చీకటి రోజన్న బాబు..వెలుతురు రోజు‘ గుర్తు చేసిన విజయసాయిరెడ్డి
X
టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేస్తున్న రచ్చపై వైసీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి - పార్లమెంటులో ఆ పార్టీ పక్ష నేత వేణుంబాక విజయసాయిరెడ్డి తనదైన శైలి పంచ్ విసిరారు. టీడీపీ శ్రేణులపై దాడులకు దిగుతున్న వైసీపీ ప్రభుత్వం... బాదితులు ఊళ్లు విడిచేలా చేస్తోందని ఆరోపిస్తూ చంద్రబాబు అండ్ కో ‘చలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిలుపునకు వైసీపీ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యిందని చెప్పాలి. టీడీపీ చలో ఆత్మకూరు అంటే... తాము కూడా అక్కడికే వస్తామని - ప్రజల సమక్షంలోనే వాస్తవాలేమిటో నిగ్గు తేలుద్దామని పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఇరు వర్గాలకు పోలీసులు అనుమతులు ఇవ్వకపోగా... తమకు ఒక్కరికి మాత్రమే అనుమతులు ఇవ్వలేదన్నట్లుగా చంద్రబాబు... ఈ రోజును చీకటి రోజుగా అభివర్ణించారు. దీనిపై ఏమాత్రం ఆలస్యం చేయకుండానే సాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు.

వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలు - కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించిన చంద్రబాబు... చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని నిర్వహించి తీరతామని పట్టుబట్టారు. ఈ క్రమంలో ఆయనను ఆయన ఇంటివద్దే అడ్డుకున్న పోలీసులు బయటకు వెళ్లడం కుదరదని చెప్పేశారు. దీంతో చేసేది లేక చంద్రబాబు ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన చంద్రబాబు... వైసీపీ జమానాలో ఇది చీకటి రోజని అబివర్ణించారు. రాష్ట్రంలో పాలన తీరు ఎలా ఉందో ఈ రోజును చూస్తే సరిపోతుందని కూడా వైసీపీ సర్కారుపై ఆయన నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఇలా... చీకటి రోజులంటూ పలకగానే... అవతలి వైపు నుంచి విజయ సాయిరెడ్డి ఎంట్రీ ఇచ్చారు. రెండు వరుస ట్వీట్లతో బాబు వైఖరిపై నిప్పులు చెరిగిన విజయ సాయిరెడ్డి... చంద్రబాబు పాలనలో ఎలా వ్యవహారం నడిచిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. జగన్ ను అరెస్ట్ చేసిన రోజు వెలుతురు రోజా? అంటూ విజయసాయిరెడ్డి సంధించిన ట్వీట్ నిజంగానే పేలిపోయిందని చెప్పక తప్పదు.

సదరు ట్వీట్లలో విజయసాయిరెడ్డి ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘దొంగే దొంగని గోల పెట్టడంలా ఉంటాయి చంద్రబాబు గారి వేషాలు. ఐదేళ్లూ అలాగే చేశాడు. అందుకే ప్రజలు గూబ గుయ్ మనిపించి బయటకు విసిరేశారు. మళ్లీ అవే పాత ట్రిక్కులు ప్లే చేస్తున్నాడు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నోడు వాళ్ల కోసమే ఛలో ఆత్మకూర్ అంటే నమ్మే అమాయకులుంటారా? ’అంటూ తొలి ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి... ‘చీకటి రోజుల గురించి చంద్రబాబు గారు చెబ్తుంటే వినాలి. ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో ప్రతిపక్ష నేతను విశాఖ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా అరెస్టు చేస్తే అయన దృష్టిలో వెలుతురు రోజు? ముద్రగడ గారిని హౌజ్ అరెస్ట్ చేసి మహిళలను పోలీసులతో బూతులు తిట్టించినపుడు వాళ్ల హక్కులు గుర్తు రాలేదు’అంటూ రెండో ట్వీట్ లో చురకలటించారు.