మహిళల్లో లైంగిక ఆనందాన్ని రెట్టింపు చేసే వయాగ్రా క్రీమ్

Sun Jul 25 2021 22:00:01 GMT+0530 (IST)

Viagra cream that doubles sexual pleasure in women

శృంగారంలో భావోద్వేగం ఇద్దరికీ కలిగి తృప్తి చెందినప్పుడే దానికి సార్థకత.. పురుషులకే కాదు మహిళలు దాన్ని అనుభవించాలి.. అస్వాదించాలి. ప్రస్తుత జీవనశైలిలో నిద్రలేమి సహా అనారోగ్య సమస్యలు పని ఒత్తిడితో లైంగిక జీవితాన్ని ఎవరూ ఆనందించలేని పరిస్థితి. కరోనా వైరస్ కారణంగా ఈ భయాలతో శృంగారాన్ని దూరం పెట్టిన వారు ఎందరో..ఈ క్రమంలోనే రానురాను మహిళల్లో లైంగిక వాంఛలతో పాటు శృంగారంపై ఆసక్తి తగ్గిపోతోంది. మానసికంగానూ.. శారీరకంగానూ సిద్ధంగా లేకపోవడం వల్ల కుటుంబాల్లో అనేక సమస్యలకు దారితీస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు తమ లైంగిక జీవితాన్ని ఆనందంగా ఉంచుకునేందుకు అవసరమైన విధానాలను లైంగిక నిపుణులు సూచిస్తున్నారు.

పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచేది ‘వయాగ్రా’. ఇప్పుడు మహిళల్లోనూ దాన్ని వినియోగించడానికి రంగం సిద్ధమైంది. పురుషులకు వయాగ్రా ట్యాబెట్ల రూపంలో ఉంటుంది. అదే మహిళల్లో అయితే క్రీమ్ రూపంలో వయాగ్రా అందుబాటులో ఉంటుంది. వయాగ్రా నుంచి తయారైన ఈ క్రీమ్ వాడటం వల్ల మహిళల్లో లైంగిక ఆనందానికి సాయపడుతుందని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు. ఈ వయాగ్రా ఎలా పనిచేస్తుందో కూడా ఇప్పటికీ పరీక్షించి చూశారు.

ఒక టీ స్పూన్ వయాగ్రా క్రీమ్ తీసుకొని తమ జననాంగాలపై రాసి మెల్లగా రుద్దాలి. అలా చేయడం ద్వారా అక్కడి రక్తనాళాలను ఉత్తేజపరిచిందట.. ఫలితంగా వారిలో లైంగికపరమైన కోరికలు కలుగుతాయట.. లైంగిక సమస్యలతో బాధపడుతున్న లక్షలాది మందికి ఈ వయాగ్రా అద్భుతంగా ఉపయోగపడిందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.

ఈ వయాగ్రీ క్రీమ్ తో లైంగిక కోరికలు కలిగిన 400 మందికి పైగా మహిళలపై అమెరికా లో ప్రయోగాలు జరుగుతున్నాయి. వారానికి సగం మంది వాలంటీర్లకు మూడు సార్లు క్రీమ్ పూస్తున్నారు. మిగిలిన వారికి ప్లేసిబో అందించారు. వీరిలో ఎవరికి ఉద్వేగం వచ్చిందో గమనిస్తున్నారు. ఈ ప్రయోగాలు ఫలిస్తే ఇక మహిళలు కూడా ఎంజాయ్ చేయవచ్చని అంటున్నారు.