కరోనాతో మాజీ ఎన్నికల కమిషనర్ దుర్మరణం !

Thu Jul 16 2020 23:00:01 GMT+0530 (IST)

Veteran IAS Neela Satyanarayan dies due to coronavirus

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఈ  సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ కరోనా దెబ్బకి వణికి పోతున్నారు.  ముఖ్యం గా కరోనా వైరస్ మహారాష్ట్ర లో కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్ర లో పాజిటీవ్ కేసుల సంఖ్య 3లక్షలకు చేరువ లో ఉంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 7975 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. మాజీ ఐఏఎస్ అధికారిణి మహారాష్ట్ర మొదటి మహిళా ఎన్నికల కమిషనర్ నీలా సత్య నారాయణ్ కరోనా భారిన పడి చికిత్స తీసుకుంటూ మరణించారు. 72 ఏండ్ల సత్య నారాయణ్ కొన్నిరోజులు గా కరోనా భారిన పడి చికిత్స తీసుకుంటూ బాధ పడుతున్నారు.
 
ఆమె ముంబైలోని సెవన్ హిల్స్  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడం తో ఈ రోజు ఉదయం 8 గంటలకు మరణించారని హాస్పిటల్ అధికారులు ప్రకటించారు. 1972 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన నీలా సత్యనారాయణ్ 2014 జూలై 5న రిటైర్ అయ్యారు. పదవీ విరమణకు ముందు మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ కు మొదటి మహిళా కమిషనర్ గా 2009లో నియమితులయ్యారు.   ఆమె పదవీ విరమణ తర్వాత అనేక పుస్తకాలు రాశారు. మొత్తంగా సత్య నారాయణ్ 23 పుస్తకాలు రాశారు. పలు సినిమాల కు సాహిత్యం కూడా అందించారు.