మోడీకి మంచి మాట చెప్పిన వెంకయ్య

Sat Sep 24 2022 17:08:57 GMT+0530 (India Standard Time)

Venkaiah said a good word to Modi

ఆయన తెలుగు దిగ్గజ నాయకుడు. ఢిల్లీ స్థాయిలో వెలిగిన నేత. ఉప రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవి దాకా వచ్చిన ఆ నాయకుడే ముప్పవరపు వెంకయ్యనాయుడు. ఆయన  ఇప్పటికి నెలన్నర క్రితం ఉప రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయారు. నాటి నుంచి ఆయన హుందా అయిన ప్రజా జీవితాన్ని గడుపుతున్నారు. మేధావులు పెద్దల సమావేశాల్లో ఎక్కువగా  పాలుపంచుకుంటూ దేశానికి రాజకీయ నేతలు ఎన్నో విలువైన సూచనలు ఇస్తున్నారు.తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మోడీ ప్రసంగాలతో కూడిన సబ్ కా సాధ్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మోడీని ఆకాశాన్ని ఎత్తేశారు. మోడీ ప్రధాని అయ్యాక దేశం ఆరోగ్య విదేశాంగం సాంకేతిక రంగాలలో బాగా వృద్ధి సాధించింది అని కొనియాడారు. ఈ రోజు ప్రపంచంలో భారత్ ని ముందున నిలబెట్టారని అన్నారు.

అయితే మోడీ పాలన మీద కొన్ని వర్గాలలో వ్యతిరేకత ఉందని వెంకయ్యనాయుడు కుండబద్ధలు కొట్టారు. అయితే దానికి రాజకీయ పరమైన కారణాలతో పాటు కొన్ని సెక్షన్లలో అపార్ధాలు కూడా ఉండవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. వీటిని చెరిపివేసేందుకు ఈ గ్యాప్ ని దూరం చేసుకునేందుకు మోడీ తరచూ రాజకీయ వర్గాలంతో సమావేశాలు పెడుతూ ఉండాలని మంచి సలహా ఇచ్చారు.

అదే విధంగా ప్రతిపక్షాలను కూడా మోడీ కలవడం వారితో భేటీలు వేయడం లనటివి కూడా చేయాలని సూచించారు. దీని వల్ల అంతరాలు అపార్ధాలు తొలగిపోతాయని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీల నేతలు విశాల దృక్పధం అలవాటు చేసుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు. రాజకీయాల్లో ఉన్న వారు శత్రువులు కారని ప్రత్యర్ధులు మాత్రమే అని ఆయన విశ్లేషించారు. మొత్తానికి మోడీకి మంచి సలహావే వెంకయ్యనాయుడు ఇచ్చారు.

కానీ మోడీ ప్రధానిగా చూసుకుంటే గడచిన ఎనిమిదేళ్ల కాలంలో ఆయన పెద్దగా ప్రతిపక్షాలను కలిసింది లేదు వారితో చర్చించింది లేదు అని ప్రచారంలో ఉంది. అలాగే ఆయన మీడియా సమావేశాలను కూడా నిర్వహించినది కూడా లేదని అంటారు. మరి మోడీ ఈ విషయంలో కనుక తమ పాలనను తీర్చిదిద్దుకోవాలన్నా అలాగే తప్పుకు పొరపాట్లు దిద్దుకోవాలన్నా కూడా విపక్షాలు మీడియా నుంచే సరైన సూచనలు వస్తాయి.

ఉప రాష్ట్రపతి వంటి కీలకమైన  పదవీ బాధ్యతలు చేపట్టిన వెంకయ్యనాయుదు రాజకీయాలకు అతీతంగా విలువైన సూచనలే మోడీకి చేశారని అంటున్నారు. మరి మోడీ దానికి స్వీకరించి ఆచరణలో పెడితే మంచిదే అని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.