Begin typing your search above and press return to search.

వెలగపూడి వర్సెస్ ఎంవీవీ...తూర్పులో కమ్మనైన పోటీ...?

By:  Tupaki Desk   |   5 Dec 2022 11:30 AM GMT
వెలగపూడి వర్సెస్ ఎంవీవీ...తూర్పులో కమ్మనైన పోటీ...?
X
విశాఖలో 2009 తరువాత ఏర్పడిన తూర్పు నియోజకవర్గం టీడీపీకి పెట్టని కోటగా ఉంది. ఈ నియోజకవర్గానికి మూడు సార్లు ఎన్నికలు జరిగితే మూడు సార్లూ టీడీపీ గెలిచింది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సీనియర్ టీడీపీ నేత వెలగపూడి రామక్రిష్ణబాబు ఉన్నారు. ఆయన క్రిష్ణా జిల్లాకు చెందిన వారు అయినా వ్యాపార నిమిత్తం విశాఖకు వచ్చినా స్థానిక ప్రజలతో మమేకం అయ్యారు. దాంతో పాటు విశాఖలో స్థానికంగా ఉన్న కీలకమైన సామాజికవర్గాలతో ఆయనకు మంచి రిలెషన్స్ ఉన్నాయి.

దాంతో విశాఖ తూర్పులో వరస విజయాలకు అది కారణం అవుతోంది. ఆయన 2014 ఎన్నికల్లో 45 వేల ఓట్ల మెజారిటీని సాధించారు. 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లో కూడా పాతిక వేలకు తక్కువ కాకుండా మెజారిటీ తెచ్చుకుని గెలుపు వీరుడిగా నిలిచారు. అలాంటి వెలగపూడిని ఓడించాలి అంటే వైసీపీకి బిగ్ టాస్క్ గా ఉంది. 2014 నుంచి రెండు సార్లు వైసీపీ విశ్వప్రయత్నం చేసినా కూడా వెలగపూడిని మాజీని చేయలేకపోయింది.

దాంతో ఈసారి వెలగపూడి సామాజికవర్గానికి చెందిన బిగ్ షాట్ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను అక్కడ పోటీకి దింపుతున్నారు అని అంటున్నారు. యాక్సిడెంటల్ ఆ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎంవీవీ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖుడు. 2019 ఎన్నికల్లో ఆయన విశాఖ ఎంపీ సీటుకి వైసీపీ నుంచి టికెట్ తెచ్చుకుని పోటీ చేసి గెలిచారు. ఆనాడు విశాఖ ఎంపీ సీటు వైసీపీకి బిగ్ టాస్క్. అయితే ఎంవీవీ గెలిచి చూపించారు.

దానికి ఆయన లక్ కూడా కలసి వచ్చింది. ఎంపీగా జనసేన తరఫున పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణకు టీడీపీ ఓట్లు క్రాస్ కావడంతో నాలుగు వేల ఓట్ల తేడాతో ఎంవీవీ గెలిచారు. ఆ విధంగా విశాఖ ఎంపీ సీటు వైసీపీ ఖాతాలో పడేలా చేశారు. ఇక ఆయన మూడున్నరేళ్ళుగా ఎంపీగా గొప్పగా చేసింది లేదు. ఆయన పనితీరు చప్పగా ఉంది. పైగా మరో ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన మధ్య వివాదం నడచి ఇద్దరూ తమ గుట్టుని బయటేసుకున్నారు. దాంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ రాకపోవచ్చు అని అంటున్నారు.

ఒకవేళ ఇచ్చినా గెలుపు కష్టం అని అంటున్నారు. దాంతో ఆయన రాజకీయం ఇంతటితో సరా అంటే ఆయన బిగ్ షాట్. పైగా అత్యంత ధనవంతుడు. మరి ఆయన్ని ఎలా వదులుకుంటారు. అందుకే ఆయనకు మరో బిగ్ టాస్క్ ని వైసీపీ అప్పగించింది అని అంటున్నారు. ఆయన్ని ఏరి కోరి వెలగపూడి మీదకు ఫైటింగ్ కి పంపుతున్నారు. ఇక తూర్పులోనే నివాసం ఉంటున్న ఎంవీవీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా రెడీ అంటున్నారు. అయితే ఈ సీట్లో బీసీలు ఎక్కువ. పైగా కమ్మలు బహు తక్కువ. కానీ అందరితో మంచి చేసుకుని వెలగపూడి గెలుసుత్న్నారు. ఆయన మీద ఎంవీవీని పెడితే ఈ బిగ్ షాట్ ఢీ కొట్టి గెలిచి రావచ్చు అన్నది వైసీపీ ఆశగా ఉంది.

మొత్తానికి చూస్తే రెండు సార్లు తూర్పు తిరిగి దండం పెట్టేసిన వైసీపీకి ఎంవీవీ తన లక్ ని జతకలిపి విజయం అందిస్తారా అన్నది చూడాలి అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ ఇద్దరు నేతలు ఢీ కొంటే తూర్పులో అది కమ్మమైన యుద్ధం అవుతుంది అని అంటున్నారు. మరి ఎవరు గెలుస్తారు అన్నది చెప్పలేమని కూడా అంటున్నారు. ఎందుకంటే వెలగపూడి పట్లు గుట్లూ తెలిసిన వారు ఎంవీవీ కాబట్టి అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.