హద్దులు దాటేసిన వర్మ.. 'వారాహి' పై ఎంతలా నోరు పారేసుకున్నాడంటే?

Wed Jan 25 2023 09:59:46 GMT+0530 (India Standard Time)

Varma who crossed the limits..

వివాదాలతో సహజీవనం చేస్తూ.. తరచూ ఎవరో ఒకరిని టార్గెట్ చేసే రాంగోపాల్ వర్మ తాజాగా మరో దుమారానికి తెర తీశారు. సినీ దర్శకుడిగా తనకున్న క్రియేటివిటినీ ఇటీవల కాలంలో తాను టార్గెట్ చేసిన వారి కోసం వాడేస్తున్నఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తమయ్యే పరిస్థితి. తాజాగా.. అంతకుమించి అన్నట్లుగా.. పవన్ అభిమానుల్ని.. ఆయన్ను అమితంగా ఆరాధించే వారి మనసు గాయపడేలా.. విన్నంతనే ఒళ్లు మండేలా ట్వీట్లు చేసిన తీరు చూస్తే.. రాంగోపాల్ వర్మ అన్ని హద్దులు దాటేసినట్లుగా కనిపిస్తోంది.తన ట్వీట్లతో ఆవేశాన్ని రగిలించేలా చేసి.. ఆ ఆగ్రహంతో చేయకూడని పని ఏదైనా చేస్తే.. దానిని పవన్ కు ఆపాదించటం ద్వారా.. పవన్ కల్యాణ్ ను ఇరుకున పడేయాలన్న ఆలోచనలో రాంగోపాల్ వర్మ ఆలోచలు ఉన్నాయా? అన్న సందేహం కలిగేలా తాజాగా ఆయన చేసిన ట్వీట్లు కనిపిస్తున్నాయి. గతంలో శ్రీరెడ్డిని సైతం తన మాటలతో ప్రభావితం చేసి పవన్ కల్యాణ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసేలా చేయటం తెలిసిందే. ఇదే విషయాన్ని తర్వాతి కాలంలో శ్రీరెడ్డి సైతం ఓపెన్ అయి.. తాను అంజనమ్మను అనకూడని మాటల్ని అన్నట్లుగా వేదన చెందటం.. క్షమాపణలు కోరటం తెలిసిందే.

తాను టార్గెట్ చేసిన వారిని మిగిలిన వారి మాదిరి కాకుండా.. రోటీన్ కు భిన్నమైన తీరులో వ్యవహరించే రాంగోపాల్ వర్మ.. తాజాగా జనసేన అధినేత తన రాజకీయ ప్రచారం కోసం వినిగించేందుకు సిద్ధం చేసిన వాహనానికి 'వారాహి' అన్న పేరు పెట్టుకోవటం తెలిసిందే. ఈ వాహనంపై పెద్ద ఎత్తున చర్చ జరగటం.. వారాహితో తాను రాజకీయ ప్రచారాన్ని చేపడతానని పవన్ స్పష్టం చేయటమే కాదు.. తాజాగా కొండగట్టు ఆంజనేయస్వామి గుడిలో తన వాహనానికి పూజ చేసే కార్యక్రమాన్ని చేపట్టటం తెలిసిందే.

ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ రెచ్చిపోయి మరీ.. వారాహిని నోటికి వచ్చినట్లుగా.. పవన్ కల్యాణ్ ను సైతం ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసేలా తన మేథతో ట్వీట్లు కురిపించారు. వాహన పూజ సందర్భంగా పవన్ కల్యాణ్ ధరించిన దుస్తులను సైతం వివేకానందుకుడిరేూపంలో ఉన్నాయంటూ సెటైర్లు వేసేలా వ్యాఖ్యలు ఉన్నాయి. వీటన్నింటిని చూసినంతనే ఆగ్రహం వ్యక్తమయ్యేలా ఉన్నాయి. వర్మ లక్ష్యమే రెచ్చగొట్టటం అయినప్పుడు.. ఆయన ట్వీట్లు కచ్ఛితంగా ఇదే రీతిలో ఉండటం ఖాయం. ఇంతకూ పవన్ ను.. ఆయన వినియోగించే వారాహి వాహనాన్ని వర్మ ఏమనేశారంటే..

-  ఆ రోజుల్లో రామారావు గారు చైతన్యరథం మీద తిరిగితే మీరు పంది బస్సు మీద తిరుగుతున్నారు అంటున్న తప్పుడు నా కొడుకులందర్నీ జనసేనలతో బస్సు టైర్ల కింద తొక్కించేయండి సార్. ఒకవేళ అలా చేయడం లీగల్ గా కుదరదనుకుంటే కనీసం కేసులన్నా పెట్టించండి పవన్ కల్యాణ్ గారు. ఇది మీ ఫ్యాన్ గా నా విన్నం.

-  "గుడిలో ఉంటే అది "వారాహి" రోడ్డు మీద ఉంటే అది "పంది".. పీతన పందికి "వారాహి" అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్టే" అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి .వెంటనే వాళ్ళ నోర్లు మూయించక పోతే మన పవిత్ర "వారాహి"ని ఒక "పంది బస్సు" గా ముద్ర వేస్తారు. జై పీకే.. జై జనసేన.

-  డియర్ జనసైనికులారా దయచేసి #PandhiBassuVaarahi హ్యాష్‌ట్యాగ్ ని ట్రెండ్ అవ్వకుండా చూసుకోండి

-  బలవంతుడైన వివేకానందుడు

- హిట్లర్ వాహనం మీద స్వామి వివేకానంద

-  భయపెట్టే పంది వారాహి మీద హిట్లర్ స్వామి వివేకానంద కడి ఎడమలుగా కలిసిపోతే అదే స్టార్ పవర్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.