Begin typing your search above and press return to search.

గుడివాడలో క్యాసినో: కొడాలి నానిపై వర్మ సెటైర్లు..

By:  Tupaki Desk   |   19 Jan 2022 1:32 PM GMT
గుడివాడలో క్యాసినో: కొడాలి నానిపై వర్మ సెటైర్లు..
X
ఏపీ మంత్రి కొడాలి నానికి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు మధ్య గత కొద్ది రోజులుగా జరుగుతున్న వార్ మరోసారి రాజుకుంది. తాజాగా నేడు మరోసారి వర్మ తనదైన స్టైల్ లో సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు.

గోవాకు చెందిన క్యాసినో నిర్వాహకులు కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో జూదం ఏర్పాటు చేశారనే విషయంలో ఏపీలో జోరుగా ప్రచారమైంది. ఇదే విషయమై వర్మ సోషల్ మీడియాలో వరుసగా ట్వీట్లు చేశారు. గుడివాడ అభివృద్ధికి కొడాలి నాని ఎంతగానో పాటుపడుతున్నారని.. ఆయనకు నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నానంటూ సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా క్యాసినోపై వస్తోన్న విమర్శలను విస్మరించాలంటూ ట్వీట్ చేసి మరోసారి హీట్ పెంచారు.

'గుడి వాడ అభివృద్ధికి పాటుపడుతున్న మంత్రి కొడాలి నానికి నా ధన్యవాదాలు. మీకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. క్యాసినోపై వస్తోన్న విమర్శలను అస్సలు పట్టించుకోవద్దు.. అలాంటి వ్యతిరేక విమర్శలు చేస్తున్న వారిని విస్మరించండి' అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.

ఇక మరో ట్వీట్ లో పాశ్చాత్య నగరాలతో పోల్చి ఎండగట్టారు. 'గుడివాడను లండన్, లాస్ వెగాస్, పారిస్ లాంటి దేశాల లిస్టులో ఉంచేందుకు కొడాలి నాని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయనను తప్పకుండా మెచ్చుకోవాలి' అంటూ మరో ట్వీట్ చేశారు.

'గోవాలో క్యాసినో సంస్కృతిని ఏపీలోని గుడివాడకు తీసుకొచ్చి నానిపై విమర్శలా? గుడివాడ జనం గోవా వెళ్లి ఆడుతారు. కానీ గోవా ప్రజలు మాత్రం గుడివాడకు రాలేరు.. జై గుడివాడ' అంటూ వర్మ తనదైన శైలిలో ట్వీట్ల వర్షం కురిపించారు.