వైసీపీకి వంగవీటి రాధ రాజీనామా

Sun Jan 20 2019 19:47:16 GMT+0530 (IST)

Vangaveeti Radha Bids Goodbye To YSRC

అందరూ ఊహించినట్లే జరిగింది. వైసీపీ కి రంగా తనయుడు వంగ వీటి రాధ రాజీనామా చేశారు. రాజీనామా లేఖని పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు పంపించారు. గత కొంతకాలంగా పార్టీ నిర్ణయాలపై రాధ అసంతృప్తిగా ఉన్నారు. విజయవాడ సెంట్రల్ సీటు అడిగితే.. ఆ సీటుని మల్లాది విష్ణుకి కేటాయించింది వైసీపీ. రాధాని బందరు పార్లమెంట్ స్థానం చేయాలని ఆదేశించింది. అప్పటినుంచి పార్టీ పై అసంతృప్తిగా ఉన్నారు రాధ.        తన రాజీనామా లేఖలో కాస్త ఘాటుగానే స్పందించారు రాధ. ముఖ్యమంత్రి కావాలనుకున్న మీ ఆకాంక్ష తీర్చుకోవడం కోసం ఇతర నాయకుల పై ఆంక్షలు పెడుతున్నారు.  అయితే నా కాంక్ష నెరవేరాలంటే ఎటువంటి ఆంక్షలు లేని పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. వారం రోజుల క్రితం రాధాని బుజ్జగించేందుకు సీనియర్ నేత బొత్స రంగంలోకి దిగారు. అయితే బొత్స మంత్రాంగం ఫలించలేదు. దీంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వంగవీటి రాధ జనసేన లో చేరే అవకాశాలున్నాయని వార్తలు విన్పిస్తున్నాయి.