Begin typing your search above and press return to search.

చెత్తా చెదారంతో నిండిన ‘వందే భారత్’ ఎక్స్ ప్రెస్..!

By:  Tupaki Desk   |   29 Jan 2023 7:00 AM GMT
చెత్తా చెదారంతో నిండిన ‘వందే భారత్’ ఎక్స్ ప్రెస్..!
X
అతి తక్కువ ఖర్చుతో వేగవంతమైన ప్రయాణం చేయాలంటే రైళ్లతోనే సాధ్యం. పేదవారికి సైతం అందుబాటు ధరలో టికెట్ రేటు ఉండటంతో సుదూర ప్రయాణం చేసేవారు ఎక్కువగా రైళ్లలోనే ప్రయాణించేందుకు ఇష్టపడుతారు. అయితే వీటిలోనూ సాధారణ.. ఎక్స్ ప్రెస్.. సూపర్ ఫాస్ట్.. జనరల్.. రిజర్వుడ్.. ఏసీ.. నాన్ ఏసీ కేటగిరీలు ఉన్నాయి.

అవసరాన్ని ఒక్కొక్కరు ఒక్కో కేటగిరిలో ప్రయాణిస్తూ ఉంటారనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పేద.. మధ్యతరగతి ప్రజలు సైతం హైస్పీడు రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు మోదీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులు ప్రారంభమయ్యాయి.

అయితే వీటిని ప్రజల ఆస్థిగా చూడాల్సిన ప్రయాణికులు మాత్రం వాటిని అపరిశుభ్రతగా మారుస్తున్నారు. అన్ని హంగులతో నిండిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను ప్రయాణీకులు అపరిశుభ్రతకు కేరాఫ్ గా మారుస్తున్నారు. బోగీల్లో ఎక్కడిక్కడ వాటర్ బాటిళ్లు.. ఆహార పదార్థాలు.. ప్లాస్టిక్ కవర్లు.. చెత్తాచెదారం దర్శనమిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోను అవనిశ్ శరణ్ అనే అధికారి ట్విట్టర్లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది.

ఈ ఫోటోలో ఓ పారిశుధ్య కార్మికుడు వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో పేరుకపోయిన చెత్తాచెదారాన్ని చీపురుతో ఊడుస్తూ కన్పించాడు. ‘‘వుయ్ ద పీపుల్’’ అంటూ ఈ ఫొటోను ఆయన క్యాప్షన్ సైతం జత చేశారు. దీనిపై నెటిజన్లు సైతం విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘భారత ప్రజలు హక్కుల కోసం మాత్రం పోరాడుతారు కానీ.. తమ బాధ్యతలను విస్మరిస్తారు’’ అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశారు.

మరో నెటిజన్ స్పందిస్తూ.. తక్కువ ఖర్చుతో ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చుచేసి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడుపుతుంటే ప్రయాణికులు వాటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం విచారకరమని రాసుకొచ్చాడు. కాగా దేశవ్యాప్తంగా రైల్వే శాఖ ఎనిమిది రూట్లలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ లను నడిపిస్తోంది.

ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లోనూ వందేభారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి కానుకగా హైదరాబాద్ టూ విశాఖపట్నం మధ్య వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు నడిచాయి. ఏది ఏమైనా ప్రభుత్వం.. ప్రయాణికులు రైళ్లలో పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.