ఢిల్లీలో మోహన్ బాబుకున్న విలువా..పవన్ కు లేనట్టే!

Fri Jan 17 2020 20:00:01 GMT+0530 (IST)

Value For Pawan Kalyan in Delhi

ఈ మధ్యనే నటుడు మోహన్ బాబు తన కుటుంబ సమేతంగా మోడీ దగ్గరకు వెళ్లారు. మోహన్ బాబు కొడుకు కూతురు - కోడలు - మనవళ్లు - మనవరాళ్లు మోడీతో సెల్ఫీలు తీసుకుని వచ్చారు. దేశ ప్రధానిగా మోడీ అపాయింట్ మెంట్ ఎవరికీ అంత తేలికగా దొరకదని వేరే చెప్పనక్కర్లేదు. సీఎంలే వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అయినా మోహన్ బాబు తన పాత పరిచయాలతో మోడీని డైరెక్టుగా కలవగలిగారు. కుటుంబీకులను తీసుకెళ్లి పరిచయం చేయగలిగారు.అయితే ఒక రాజకీయ పార్టీ అధినేతగా - స్టార్ హీరోగా ఉన్న పవన్ కల్యాణ్ కు మాత్రం ఢిల్లీకి వెళితే మోడీ దర్శనం దక్కలేదు. అమిత్ షా దర్శనం కూడా దక్కలేదు! అది కూడా పవన్ కల్యాణ్ వెళ్లింది తన పని మీద కాదు. బీజేపీతో కలిసి పని చేస్తానంటూ చెప్పకోవడానికి వెళ్లారు. తను బీజేపీ మనిషిని అంటూ చెప్పుకోవడానికి వెళ్లారు.

అలా వెళ్లడానికి ముందు ఏపీలో మోడీ - అమిత్ షాలను తెగ ప్రశంసించారు. అలా ముందుగానే వాళ్ల భజన చేసి.. పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. అయినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఎలాగో నడ్డా దర్శనం దక్కింది. అది కూడా రెండు నిమిషాల ముచ్చటేనట!

పవన్ కల్యాణ్ ను కలిసి.. తనకు వేరే మీటింగ్ ఉందంటూ.. వెళ్లి ఏపీ బీజేపీ నేతలను కలవాలని సలహా ఇచ్చి నడ్డా అక్కడ నుంచి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల పాటు వెయిట్ చేస్తే కీలక నేతల అపాయింట్ మెంట్ కూడా దక్కకపోగా.. జనాలకు సరిగా తెలియని నడ్డా కూడా రెండు నిమిషాల పాటు మాట్లాడి వెళ్లిపోవడం పవన్ కల్యాణ్ కు బీజేపీ అధినాయకత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో తెలుస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి.. పవన్ లాంటి వాళ్లు ఇప్పుడు వస్తున్నారని - పార్టీని నడపడం చేతగాక పవన్ తమ వైపు వచ్చారనేది బీజేపీ వాళ్లకు తెలియని అంశం ఏమీ కాదు.

మోడీ ప్రదాని కాక ముందే.. మోహన్ బాబు లాంటి వాళ్లు ఆయనకు ఆతిధ్యం ఇచ్చారు - పవన్ కల్యాణ్ పచ్చి అవకాశవాదంతో వెళ్లారు. అందుకే మోహన్ బాబుకు అపాయింట్ మెంట్ దక్కింది - పవన్ కు కల్యాణ్ మోదరి దర్శనం దక్కలేదు...అని కూడా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరి ముందు పవన్ కు బీజేపీలో ఎంత ప్రాధాన్యత దక్కుతుందో!