వల్లభనేని వంశీ అందుకే వెనక్కి తగ్గాడా?

Tue Jul 14 2020 19:00:56 GMT+0530 (IST)

Is that why the Vallabhaneni Vamsi fell behind?

టీడీపీని ధిక్కరించి వైసీపీకి మద్దతు పలికిన రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారని సోషల్ మీడియా కోడైకూసింది. కానీ ఇప్పుడు ఆ వర్గం రాజీనామా అనే సరికి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కాదులే అంటున్నారని లోకల్ గా గుసగుసలు మొదలయ్యాయి.



ఎందుకు అని ఆరాతీస్తే.. గన్నవరంలో ఈ న్యూస్ తెగ హడావుడి చేస్తోందని అందరూ చర్చించుకుంటున్నారు.. గన్నవరంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వంశీకి కష్టమేనని లెక్కలు వేసుకుంటున్నారట.. వంశీ మీద ఓడిపోయిన వర్గం ఎలాగూ ఆయన కోసం పనిచేయదు.. వంశీ సామాజికవర్గం ఎక్కువభాగం టీడీపీ వైపు ఉందట.. బీసీ వర్గాలు అటు ఇటూ ఉన్నారు.

వల్లభనేని వంశీపై ఇటు టీడీపీ అటు వైసీపీలోనూ వ్యతిరేకత గల వారు ఎక్కువగా ఉన్నారట.. ఇది వంశీకి ఎన్నికల్లో పెద్ద దెబ్బేనని అంటున్నారు. వంశీపై టీడీపీ కూడా నజర్ పెట్టింది. అటు వైసీపీ సిట్టింగ్ ఇన్ చార్జి కూడా వ్యతిరేకంగానే ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అందుకే హ్యాండిచ్చిన వంశీ గెలుపు నియోజకవర్గంలో నల్లేరుపై నడక కాదని చెబుతున్నారు.

అందుకే రాజీనామాపై లెక్కలేసుకొని మళ్లీ గెలవడం అంత ఈజీ కాదని వంశీ వెనక్కి తగ్గినట్టు స్థానికంగా చర్చించుకుంటున్నారు. అటు టీడీపీ వాళ్లు.. ఇటు వైసీపీ వాళ్లు కూడా వంశీకి సహకరించే పరిస్థితి లేదని అందుకే ఇప్పుడు తన నిర్ణయాన్ని వంశీ వాయిదా వేసుకున్నారనే చర్చ జరుగుతోంది.