Begin typing your search above and press return to search.

వంశీ ఎత్తుగ‌డ..గాలిలో క‌లిసిపోయిన బాబు అనుభ‌వం

By:  Tupaki Desk   |   15 Dec 2019 4:16 AM GMT
వంశీ ఎత్తుగ‌డ..గాలిలో క‌లిసిపోయిన బాబు అనుభ‌వం
X
తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌గా కొన‌సాగి....అనంత‌రం ఆ పార్టీపై విరుచుకుప‌డిన గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ రాజీనామా - ఆయ‌న‌పై పార్టీ స‌స్పెన్ష‌న్ వ్య‌వ‌హారం క‌ల‌కలం సృష్టిస్తోంది. వంశీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే, రాజీనామ‌ అనంత‌రం ఆయ‌న‌పై పార్టీ సస్పెన్ష‌న్ వేటు వేసింది. దీంతో స‌హ‌జంగానే రాజీనామా చేయ‌కుండానే అటు వైసీపీలో చేర‌కుండా వంశీ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. త‌ద్వారా ఉప ఎన్నిక‌ల స‌మ‌స్య‌ను సునాయ‌సంగా త‌ప్పించుకున్నారు. అయితే, వంశీతోనే ఈ విష‌యం ముగిసిపోలేద‌ని...త్వ‌ర‌లో మ‌రిన్ని షాకులు ఉంటాయంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో ఒకరైన వంశీ పార్టీకి రాజీనామా చేయ‌గా...ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌డంతో..డిస్‌ క్వాలిఫై అయ్యే అవ‌కాశం లేదు. కాబ‌ట్టి ఆయ‌న ఎమ్మెల్యే సీటుకు వ‌చ్చిన ముప్పేమీ లేదు. తెలుగుదేశం పార్టీకి వంశీ రాజీనామా చేసినందున వాళ్లతో కలిసి కూర్చోవ‌డం లేదు. వైకాపాలో జాయిన్ కాలేదు కాబట్టి అక్కడ కూర్చోవ‌డం లేదు. వంశీని స్వతంత్ర ఎమ్మెల్యేగా పేర్కొంటూ...ఆయ‌న‌కు ప్ర‌త్యేక స్థానం కేటాయించారు. కాగా, ఇదే ఫార్ములాతో టీడీపీని మ‌రింత దెబ్బ‌కొట్టేందుకు వైసీపీ ఎత్తుగ‌డ‌లు వేస్తున్న‌ట్లు స‌మాచారం. అధికార పార్టీ పెద్ద‌ల స్కెచ్ ఫ‌లిస్తే.... వైసీపీలోకి మ‌రింత‌మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జంప‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

గతంలో తమ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారో - ఇప్పుడు అదే తరహాలో టీడీపీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తోంది. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన ఉప ఎన్నిక‌ల‌ను ఎదుర్కోన‌వ‌స‌రం లేకుండా...పార్టీ ఫిరాయించాల‌నుకునే ఎమ్మెల్యేలు అధిష్టానంపై దుమ్మెత్తిపోసి...అనంత‌రం పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్ వేటు వేయించుకుంటార‌ని - అనంత‌రం వారికి న‌చ్చిన పార్టీలో చేరుతార‌ని అంటున్నారు. త‌ద్వారా ఇటు త‌మ రాజ‌కీయ ఎత్తుగ‌డ ఫ‌లించ‌డ‌మే కాకుండా మ‌రోవైపు అన‌ర్హ‌త వేటు కూడా ప‌డ‌కుండా ఉంటుంద‌ని చెప్తున్నారు. వంశీ విష‌యంలో ఇది బాగా వ‌ర్క‌వుట్ అయినందున‌....త్వ‌ర‌లో మ‌రి కొంద‌రు ఎమ్మెల్యేలు ఇదే వైఖ‌రితో బాబుకు షాకివ్వ‌డం ఖాయ‌మంటున్నారు.