దేశంలో నవంబరు నుంచి చిన్నారులకు వ్యాక్సిన్ !

Thu Jun 10 2021 20:00:01 GMT+0530 (IST)

Vaccine for children in the country from November

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మరి జోరు కొనసాగుతుంది. ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతగా కరోనా మహమ్మారిని అదుపు చేయాలని చూస్తున్నా కూడా కొత్త కొత్త వేరియంట్స్ పుట్టుకొస్తున్నాయి. దీనితో ప్రస్తుతం మన ముందున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. ఎంత ఎక్కువగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ను ముందుకు తీసుకుపోతే అంత సేఫ్. ప్రస్తుతం మనదేశంలో 18 ఏళ్లు పై బడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే దేశంలో వ్యాక్సిన్ కొరత కొంచెం ఎక్కువగా ఉండటంతో అందరికి వ్యాక్సిన్ దొరకడంలేదు. తాజాగా ప్రధాని మోడీ మరికొన్ని రోజుల్లోనే  వ్యాక్సిన్ ఫ్రీ గా ఇస్తామని ప్రకటించారు.ఇదిలా ఉంటే..దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సినేషన్ ముమ్మరం చేశారు.  త్వరలోనే 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు కలిగిన టీనేజర్లు పిల్లలకు కూడా వ్యాక్సిన్‌లు వేయనున్నారు. జూలై తరువాత దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని కొందరు నిపుణులు చెబుతుండటంతో అందరిలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. పైగా థర్డ్ వేవ్ లో చిన్నారులపై కరోనా అధికంగా ప్రభావం చూపుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో  పిల్లలపై కొవ్యాక్సిన్ ట్రయల్స్ ను భారత్ బయోటెక్ ప్రారంభించిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పేర్కొంది. ఐసీఎంఆర్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ గ్రూప్ అధిపతి డాక్టర్ ఎన్ కె అరోరా మాట్లాడుతూ చిన్నారులపై కోవిడ్ టీకా ట్రయల్స్ పూర్తికావడానికి నాలుగు నుంచి నాలుగున్నర నెలలు పట్టవచ్చని తెలిపారు. అక్టోబర్ చివరి నాటికి ఫలికాలు వస్తాయని భావిస్తున్నామన్నారు. దీని బట్టి ..  ఈ ఏడాది నవంబర్ నాటికి రెండేళ్లు పైబడిన వయసు కలిగిన పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే అవకాశాలున్నాయన్నారు.