రిషబ్ పంత్ ని పిల్ల బచ్చా అనేసిన ఊర్వశి రౌతేలా!

Fri Aug 12 2022 15:10:57 GMT+0530 (IST)

Controversy Between Actress Urvashi Rautela And Cricketer Rishabh Pant

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా-క్రికెటర్ రిషబ్ పంత్ మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. అసలు ఈ వివాదం ఇద్దరిది కాకపోయినా.. వాళ్లకు వాళ్లుగా  నెత్తిమీద వేసుకుని ఒకరికొకరు విమర్శించుకుంటున్నారు. తాజాగా రిషబ్ బంత్ ని ఊర్వశి  `పిల్ల బచ్చా` అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. పరోక్షంగా పంత్ ని `కౌగర్ హంటర్` అంటూ మండిపడింది.కౌగర్ హంటర్ అంటే? (తన కంటే ఎక్కువ వయసున్న అమ్మాయితో లైంగిక సంబంధం కోరుకునే వ్యక్తి) అని చురకలు వేసింది. `` చోటా భయ్యా నువ్వు బ్యాట్..బాల్ తో మాత్రమే ఆడుకో. నేను మున్నీ ని కాదు. నీలాంటి బచ్చాలు వల్ల బద్నాం అవ్వను`` అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. `కౌగర్ హంటర్` డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ సైలెంట్ గాళ్` అనే హ్యాష్ ట్యాగ్ ని జత చేసింది.

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ వ్యాఖ్యలపై పంత్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అసలు ఇద్దరి మధ్య వివాదం  ఎలా మొదలైందో? ఓ సారి ఆ  వివరాల్లోకి  వెళ్తే... ఊర్వశి కోసం  రిషబ్ పంత్ ఎయిర్ పోర్టులో గంటల తరబడి వెయిట్ చేసాడని..ఇద్దరి మధ్య ఎఫైర్  ఉందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి తన కోసం  ఆర్ పీ అనే వ్యక్తి  ఎయిర్ పోర్టులో వెయిట్ చేసాడని చెప్పింది.

షూటింగ్ కారణంగా అలసిపోయి జర్నీలో నిద్రపోయానని లేచి చూసే సరికి ఆర్ పీ నుంచి 17 మిస్ట్ కాల్స్ ఉన్నాయని చెప్పింది. ఇంతకీ ఆర్ పీ ఎవరంటే? ఇప్పుడే చెప్పలేనని  చెప్పుకొచ్చింది. దీంతో అంతా రిషప్ పంత్ అని నెట్టింట ప్రచారం చేసారు. అవి వైరల్ కావడంతో ఊర్వశి పై ఎటాకింగ్ కి దిగాడు పంత్. `ఫేమ్ కోసం ఎలాంటి అబద్దాలైనా చెబుతారు.

అవతలి వారిని ఇబ్బంది పెడతారు. ప్లీజ్ అక్క నన్ను వదిలేయ్ అంటూ హ్యాష్ ట్యాగ్  తో కౌంటర్ ఇచ్చాడు. దీనికి ప్రతిగానే ఊర్వశి తాజాగా పోస్ట్ పెట్టింది. దీంతో నెట్టింట మళ్లీ రచ్చ మొదలైంది. మరి ఈ వివాదానికి ఎలాంటి ముగింపు ఉంటుందో చూడాలి.

కొన్నేళ్ల క్రితం త్రిష- క్రికెటర్ హేమంగ్ బదానీ మధ్య ఓ పబ్ లో తీవ్రమైన వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఒకర్ని ఒకరు పబ్లిక్ గానే దూషించుకున్నారు.  ఒకరిపై ఒకరు  కేసులు కూడా పెట్టుకున్నారు. అప్పట్లో ఈ వివాదం ఓ సంచలనం.