ఆ స్థానాల్లో వైసీపీ గెలవదు గురూ.. !

Fri Sep 30 2022 14:43:37 GMT+0530 (India Standard Time)

Updates News On TDP YCP Politics

ఔను.. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు. కానీ.. వైసీపీ వర్సెస్.. ఇతర పార్టీల మధ్య ఎన్నికల రాజకీ యం మాత్రం తీవ్రస్థాయిలో దుమారం రేపుతోంది. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వ ప్రజా వ్యతిరేకత తమకు అండగా మారుతుందని..టీడీపీ ఇతర పక్షాలు భావిస్తున్నాయి. ఇక తాము ఇస్తున్న సంక్షేమం దేశంలో ఎవరూ ఇవ్వడం లేదని.. వైసీపీ చెబుతోంది. దీంతో.. ఎన్నికల విషయం అత్యంత కీలకంగా మారిపోయిందనే వాదన వినిపిస్తోంది.అయితే.. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా.. ఎవరు ఎన్ని అంచనాలు వేసుకున్నా.. జనం లెక్కలు.. నెటిజనం.. లెక్కలు వేరేగా ఉన్నాయి. అవేంటంటే.. టీడీపీ ఇప్పుడు.. ఎక్కడైతే.. పాగా వేసిందో.. అంటే.. గత ఎన్నిక ల్లో జగన్ సునామీని తట్టుకుని మరీ.. గెలిచిందో.. ఆ స్థానాల్లో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కడం సాధ్యం కాదని.. నెటిజన్లు చెబుతున్నారు.

ఇది.. అనేక రూపాల్లో చేపడుతున్న సర్వేల్లో.. స్ఫష్టంగా తేలిందట.  గత ఎన్నికల్లో 23 స్థానాల్లో.. వైసీపీ ఓడిపోయి.. టీడీపీ గెలిచింది.

అయితే.. ఈ 23 స్థానాల్లోనూ.. వైసీపీ వచ్చే ఎన్నికల్లో విజయందక్కించుకునేందుకు.. ప్రయత్నిస్తోంది. అంటే.. వైసీపీ టార్గెట్ 175 ఏదైతే ఉందో అది సాధించాలనేది వైసీపీ అధినేత వ్యూహం.అయితే.. ఈ వ్యూహం ఫలించడం ఎలా ఉన్నా.. ఈ 23 స్థానాల్లో మాత్రం.. టీడీపీనే గెలుస్తుందని అంటున్నారు పరిశీల కులు.

ఇతర నియోజకవర్గాల్లో పార్టీ గెలవదని కాదు.. ఇప్పటికిప్పుడు ఉన్న అంచనా మేరకు ఈ 23 స్థానా లను వైసీపీ వదిలేసుకుని.. మిగిలిన వాటి కోసం పోరాటం చేయాలని అంటున్నారు.

గత ఎన్నికల్లో 23 స్థానాలను దక్కించుకున్న టీడీపీ నేతలు.. నలుగురు పార్టీకి దూరమయ్యారు. ఒకరు రాజీనామా చేశారు (డమ్మీ రాజీనామా అనే ప్రచారం ఉంది). మిగిలిన వారు.. అందరూ.. పార్టీలోనే ఉన్నారు. అంతేకాదు.. ఒక్కబాలయ్య మినహా.. అందరూ యాక్టివ్‌గా.. పోరాటం చేస్తున్నారు. అసెంబ్లీలోనూ.. బలమైన గళం వినిపిస్తున్నారు. సో.. వీరు.. గెలుస్తారు. ఇక వైసీపీకి చేరువైన వారి నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు ఖాయం అంటున్నారు. అక్కడ ప్రజలు సానుభూతి చూపుతున్నారని అంటున్నారు. సో.. వైసీపీ లెక్కలో ఆ 23 లేనట్టే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.