తాడికొండ సరే.. ఇప్పుడు గురజాల హీటెక్కిందిగా!

Mon Aug 29 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

Update News On Tdp Politics

గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ వర్గ పోరు తారస్థాయికి చేరింది. ఒక నియోజకవర్గం వది లితే.. మరో నియోజకవర్గానికి ఈ వివాదాలు పాకుతున్నాయి. తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవికి.. అధిష్టాన మే పొగబెట్టిందనే టాక్ పార్టీలో వినిపిస్తుండడం గమనార్హం. ఇక్కడ సమన్వయకుడిగా.. టీడీపీ నుంచి వచ్చి న డొక్కా మాణిక్యవరప్రసాదరావును నియమించారు. దీంతో ఈ పరిణామంపై ఉండవల్లి వర్గం తాడేపేడో తేల్చుకునేందుకు రోడ్డెక్కిన విషయం తెలిసిందే.



అయితే.. తాజాగా మరో వివాదం తెరమీదికి వచ్చింది. అది టీడీపీ కంచుకోట వంటి గురజాల నియోజకవర్గం లో కావడం.. గమనార్హం. ఈ నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు యరపతినేని శ్రీనివాసరావు వరుస విజ యాలు దక్కించుకుంటున్నారు. అయితే.. గత ఎన్నికల్లో  వైసీపీ ఇక్కడ పాగా వేసింది. కాసు మహేష్‌రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. అయితే.. ఇప్పుడు ఇదే నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య వివాదాలు తారస్థాయికి చేరాయి.  

తాజాగా ఎమ్మెల్యే కాసు- ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తిల మధ్య పోరు నెలకొంది. ఇటీవలే శాసనమండలి విప్‌గా జంగా కృష్ణ మూర్తి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్వగ్రామంలో జంగాకు అభిమానులు అభినందన సభ ఏర్పాటు చేశారు.

అయితే జంగా అభినందన సభకు వెళ్ళద్దంటూ ఎమ్మెల్యే కాసు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలను పక్కన పెట్టి మరీ అభినందన సభకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో జంగా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు.

కావాలనే బ్యానర్లు తొలగిస్తున్నారంటూ జంగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించారని ఆరోపణలు చేశారు. ఇప్పటికే క్వారీ విషయంలో ఇరువురు నేతలకు మధ్య జరిగిన రాజకీయంతో పార్టీ పరువు రోడ్డు పడ్డ విషయం తెలిసిందే.

తాజాగా ఎమ్మెల్యే కాసు ఎమ్మెల్సీ జంగా మధ్య పోరు ఎక్కడికి దారి తీస్తుందో అని వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మొత్తంగా.. బలమైన నియోజకవర్గంలో వైసీపీ వర్గ పోరును టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు కూడాచేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.