ఆఖరుకు పెరుగు మాంసాన్ని వదలవా మోడీ సార్?

Wed Jun 29 2022 11:42:06 GMT+0530 (IST)

Update News On Modi Government

ప్రజలకు మేలు చేయాల్సిన కేంద్రంలోని బీజేపీ సర్కార్ వారి నెత్తిన భారం మోపుతోంది. ధరలు తగ్గించాల్సిందిపోయి విపరీతంగా పెంచుతూ దోచుకుంటోంది. వరుసగా 18వ రోజు కూడా పెట్రోల్ డీజీల్ ధరలు పెంచుతూ మోడీ సర్కార్ దేశ ప్రజలకు వాతలు పెడుతోంది. అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 20 డాలర్లకు పడిపోయినా కానీ ఆ తగ్గింపును ప్రజలకు మరల్చకుండా మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర వరుసగా పెంచుకుంటూ పోతోంది..కరోనా-లాక్ డౌన్ తో ప్రజల  ఆదాయం పడిపోయింది.. రూపాయి రూపాయికి జనం వెతుక్కుంటున్నారు. ఉద్యోగాలు ఉపాధి కోల్పోయి అరిగోసపడుతున్నారు. అమెరికా యూరప్ జపాన్ లో ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు వేసి వారి ఆర్థిక పరిస్థితి దిగజారకుండా అక్కడి ప్రభుత్వాలు కాపాడుతున్నాయి.కానీ మన మోడీసార్ మాత్రం ఆ ఒక్కటి అడ్డక్కండి అంటున్నారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎటు పోయిందో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఇంతటి క్లిష్ట సమయంలో మోడీసర్కార్ దోపిడీకి పాల్పడుతోంది. ఈ దోపిడీ అవసరమా మోడీజీ అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల నెత్తిన భారం మోపి దోచుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కనికరం లేని బీజేపీ సర్కార్ పై ఆడిపోసుకుంటున్నారు.

20 లక్షల కోట్లు అంటూ ప్రకటించిన మోడీ ప్యాకేజీ ఒట్టి గాలిబుడగ అని తేలిపోయింది. ప్రజల ఉద్యోగాలు నిలబడలేదు. జీతాల లోటు భర్తీ కాలేదు. ఏ పథకమూ దరిచేరలేదు. వట్టి గ్యాస్ అని తెలంగాణ సీఎం సహా దేశంలోని సీఎంలంతా మోడీజీ ప్యాకేజీపై నిప్పులు పోశారు.

పోనీ పథకాలు ఆర్థిక సాయం చేయడంలో మోడీకి చేయి రాలేదు సరే.. కనీసం ధరలు అయినా పెంచకపోతే ప్రజలు బతుకుతారు కదా అంటే.. దానిమీద మోడీ సార్ శవాల మీద పేలాలు ఏరుకునే చందంగా వ్యవహరిస్తున్నారని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా కేంద్రం సామాన్యులకు మరో షాక్ ఇచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో అన్ని రాష్ట్రాలు యూటీల ప్రతినిధులతో కూడిన ప్యానెల్ రెండు రోజుల జీఎస్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనిలో కొన్ని సామాన్యులపై మోయలేని భారాన్ని మోపనున్నాయి.

సోలార్ వాటర్ హీటర్లు లెథర్ వస్తువులు మిల్లింగ్ మిషనరీ ఈ-వ్యర్థాలపై జీఎస్టీ రేటును భారీగా పెంచాయి. ముందుగా ప్యాక్ చేసిన లేబుల్ చేయబడిన మాంసం చేపలు పెరుగు పనీర్ తేనె ఎండిన చిక్కుల్లు ఫాక్స్ నట్స్ గోధుమలు తృణధాన్యాలు గోధుమలు లేదా మెస్లిన్ పిండి బెల్లం పఫ్డ్ రైస్ సేంద్రియ ఎరువు కొబ్బరి పీత్ కంపోస్ట్ లపై ఇక పై 5శాతం జీఎస్టీ విధిస్తూ వాతపెట్టారు. ఇక చెక్కుల జారీకి బ్యాంకులు వసూలు చేసే రుసుంపై 18శాతం జీఎస్టీ అమలవుతుంది. ఇదే సమయంలో అన్ బ్రాండెడ్ వస్తువులు ప్యాక్ చేయని ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయింపులు కొనసాగనుంది. రోజుకు రూ.1000 కంటే ఎక్కువ ఖరీదైన హోటల్ గదులపై 12శాతం ట్యాక్స్ విధించబడుతుంది.

ఇక జూదం రాయిళ్లకు షాక్ ఇచ్చింది. కాసినోలు ఆన్ లైన్ గేమింగ్ గుర్రపు రేసులోపై 28శాతం పన్నుతోపాటు సీజీఎస్టీలో చేర్చబడిన సేల్స్ ట్యాక్స్ (వ్యాట్) పన్నుల నుంచి రాష్ట్రాలు కోల్పోయిన ఆదాయానికి చెల్లించే పరిహారాన్ని పొడిగించాలనే డిమాండ్ పై కౌన్సిల్ బుధవారం చర్చించే అవకాశం ఉంది.

మొత్తంగా జీఎస్టీ రాబడిలో రాష్ట్రాలను తుంగలో తొక్కి దోచుకోవడమే ధ్యేయంగా మోడీ సర్కార్ ఉప్పు పప్పు నుంచి అన్నింటిపై భారం మోపుతూ వీరబాదుడు బాడి సామాన్యుడిని అతలాకుతలం చేస్తోంది.