Begin typing your search above and press return to search.

వచ్చే ఎన్నికల్లో కాపులు ఏ టర్న్ ...?

By:  Tupaki Desk   |   2 Jun 2023 10:05 PM GMT
వచ్చే ఎన్నికల్లో కాపులు ఏ టర్న్ ...?
X
ఏపీలో 2024 లో జరిగే ఎన్నికల్లో కాపులు అత్యంత కీలకమైన భూమిక పోషిస్తారు అని అంతా అనుకుంటున్నదే. ముఖ్యంగా గోదావరి జిల్లా సెంటిమెంట్ ఎపుడూ ఏపీలో అధికారాన్ని మారుస్తుంది. 2014లో బాబుని సీఎం ని చేసినా 2019లో జగన్ని ముఖ్యమంత్రిగా చేసినా కాపులదే ప్రధాన పాత్ర. అలాంటి కాపులు 2024లో ఎలాంటి టర్న్ తీసుకుంటారు అన్నదే చర్చగా ఉంది.

నిజానికి ఈసారి కాపులు చాలా నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తారు అని అంతా భావించారు. జనసేన బలమైన ఫోర్స్ గా ముందుకు వస్తుందని కూడా ఊహించారు. అయితే పవన్ కళ్యాన్ తాను సీఎం క్యాండిడేట్ ని కాదని ఇటీవల కుండబద్ధలు కొట్టేశారు. తనను 2019లో ఓడించిన తరువాత సీఎం సీటు ఎలా డిమాండ్ చేస్తామని కూడా ప్రశ్నించారు.

సీఎం సీటు కోసం సొంతంగా పోరాటం చేయాల్సిందే అని తేల్చేసారు. దాంతో కాపులకు పక్కాగా క్లారిటీ వచ్చేసింది. నిజానికి ఇలాంటి క్లారిటీ రావాలనే పవన్ కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశారు. పొత్తులు పెట్టుకుని సీఎం అభ్యర్ధిగా పవన్ అనుకున్న లేక అధికారంలో వాటా ఇస్తారని మభ్యపెడుతూ వెళ్లినా అది తప్పు అవుతుందని పవన్ నిజాయతీగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశారు.

దాంతో కాపులకు ఇపుడు తాము ఏం చేయాలన్న దాని మీద ఆలోచించుకునే అవకాశం ఏర్పడింది. ఉభయ గోదావరి జిల్లలతో పాటు ఉత్తరాంధ్రాలో దక్షిణ కోస్తాలో కాపులు ప్రభావితం చేసే సీట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. పవన్ని కనుక సీఎం గా చూడాలనుకుంటే వారంతా కూటమికి జై కొట్టడం ఖాయం. కానీ పవనే చెప్పేశాక వారికి ఉత్సాహం పెద్దగా ఉండకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు.

జనసేనకు ఈ రోజుకీ కమిటెడ్ గా కాపులు ఓట్లు వేయవచ్చు. అదే టైం లో తాము డిసైడింఘ్ ఫ్యాక్టర్ రోల్ నుంచి న్యూట్రల్ రోల్ లోకి షిఫ్ట్ అయినా అవవచ్చు అని అంటున్నారు. అంటే కాపులు అన్ని పార్టీలలోనూ ఉన్నారు. వైసీపీలో కూడా పెద్ద ఎత్తున కాపు ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో కాపులకే అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇస్తాయి. అందులో తాము కోరుకున్న వారికే వారు జై కొట్టవచ్చు. అంటే పార్టీల రాజకీయం ఇక్కడ ఉండదని అంటున్నారు.

ఈ ఆశలతోనే వైసీపీ కూడా చురుకుగా పావులు కదుపుతోంది. మరో వైపు ముద్రగడ పద్మనాభాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రాన్ని ఒప్పించి పెద్ద ఎత్తున నిధులను తేవడం కూడా గోదావరి జిల్లాల రాజకీయాన్ని తమ వైపు తిప్పుకోవడమే అంటున్నారు.

మరి జనసేనతో పొత్తు ఎంతవరకూ కలసి వస్తుంది అన్నది తెలుగుదేశంలోనూ మధనం జరుగుతోంది. ఏది ఎలా ఉన్నా తమ బలంతోనే గోదావరి జిలాలలో ముందుకు దూసుకుపోవాలని కూడా టీడీపీ ఆలోచన చేస్తోంది. అందుకే రాజమండ్రిలో మహానాడు మీటింగ్ ని పెట్టారని అంటున్నారు. నిజానికి కాపుల మద్దతు టీడీపీకి కూడా బాగానే ఉంది. ఇపుడు కూడా తమకు ఉన్న కాపు ఓటు బ్యాంక్ ని కాపాడుకుంటూనే జనసేన నుంచి వచ్చే అడిషనల్ ఓట్ల కోసమే టీడీపీ చూస్తోంది అంటున్నారు.

జనసేన కూడా వారాహి యాత్రను గోదావరి జిల్లలలో చేపట్టడం వెనక తమ ఓటు బ్యాంక్ ని కన్సాలిడేట్ చేసుకునే వ్యూహం ఉందని అంటున్నారు. ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ కాపుల ఓట్ల కోసం సొంత వ్యూహాలు అమలు చేస్తున్న నపధ్యంలో కాపుల ఓట్లు ఏకమొత్తంగా ఏ ఒక్క పార్టీకి పడే అవకాశాలు 2024 ఎన్నికల్లో ఉండవనే అంటున్నారు. . పొత్తుల ఎత్తులు ఎంత వరకూ ఫలిస్తాయో, వైసీపీ వ్యూహాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి మరి ఏమి జరుగుతుందో.