మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది?

Sun Aug 02 2020 00:08:06 GMT+0530 (IST)

Unknown People Hulchul at Mohan Babu House

తెలుగు నటుడు మోహన్ గురించి సాయంత్రం నుంచి ఒక వార్త వైరల్ అయ్యింది. గుర్తుతెలియని దుండగులు ఆయన ఇంటికి వెళ్లి బెదిరించినట్లు తెలుస్తోంది. అయితే అగంతకులు వచ్చినపుడు గేటు వద్ద కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డు అప్రమత్తంగా లేడని అందుకే దుండుగులు కారుతో పాటు వేగంగా కాంపౌండ్ వద్దకు దూసుకొచ్చి మోహన్ బాబు నీ అంతు చూస్తాం అని బెదిరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంఘటనపై స్వయంగా మోహన్ బాబు కుటుంబమే పోలీసులకు ఫిర్యాదు చేసింది.చాలాకాలం కిందటే మోహన్ బాబు కుటుంబాన్ని శంషాబాద్ పరిసర ప్రాంతాలకు తన ఇల్లును మార్చాడు. పొలాల మధ్య రణగొణధ్వనులకు దూరంగా నిర్మించుకున్న విశాలమైన ఇంట్లో మోహన్ బాబు కుటుంబం నివసిస్తోంది. ఈరోజు కొందరు అగంతకులు సడెన్ గా ఆయన కాంపౌండ్లో చొరబడి బెదిరించినట్లు తెలుస్తోంది. వారు సాయుధులై వచ్చారన్న అనుమానంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారని చెబుతున్నారు. అయితే దుండుగులు ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా అరిచి బెదిరిస్తూ వెళ్లిపోయారని సమాచారం.

సీసీ కెమెరాల ఆధారంగా కారు వివరాలతో పహడీషరీఫ్ పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. దుండుగులు ఏపీ 31 ఏఎస్ 0004నెంబర్ కారులో మోహన్ బాబు ఇంటికి వచ్చినట్టు మోహన్ బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే... ఈ పని ఎవరు చేసి ఉంటారు? రియల్ ఎస్టేట్ గొడవలా? సినిమా వివాదాలా? ఆర్థిక లావాదేవీలా? లేదంటే.. చిల్లర ఆకతాయులు ఊరికే ప్రచారం కోసం ఇలా చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ ఘటనపై ఆరాతీస్తున్నారు. రేపటికి మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.